Aha Dance Ikon: ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌పామ్ ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో ఓ రియాలిటీ షోను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ షో గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి చిరంజీవి హాజరై మరింత గ్లామర్ తెచ్చారు. వాగ్దేవి టైటిల్ విన్నర్‌గా నిలిచారు. ఈ షో మంచి ఆదరణతో అదరగొట్టింది. ఈ ఇండియన్ ఐడల్ తెలుగు (Indian Idol Telugu) కార్యక్రమానికి థమన్, కార్తిక్, నిత్యా మీనర్ జడ్జీలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ ఘన విజయం తర్వాత ఆహా మరోక రియాలిటీ షోను ప్రారంభిస్తోంది. ఆహా సంస్థ, ప్రముఖ యాంకర్ ఓంకార్‌తో కలిసి 'డాన్స్ ఐకాన్' అనే సరికొత్త షోతో వస్తున్నారు. ఈ షోలో పాల్గోనేవారి కోసం 22 జూన్ నుంచి ఆడిషన్స్ ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి టీమ్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. Photo : Twitter
నెమలికి నేర్పిన నడకలివి అని ఆనాడు పాడిన, రా రా రమంటున్న రణరంగంలో సిద్దంగున్నా చావో రేవో తేలాలిపుడే డాన్స్ అని ఈ మధ్య పాడినా, డాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్ బయటికొస్తారు. మరి మీలో ఎవరైనా అలాంటి డ్యాన్సర్ ఉంటే, ఆ ప్రతిభ మీకుంటే ఆహా, ఓక్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి సమర్పిస్తున్న 'డాన్స్ ఐకాన్' అనే షో మీ కోసమే. మీ ప్రతిభకు మా వేదిక శిరస్సు వంచి ఆహ్వానిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఆడిషన్స్ ఇచ్చేయండి, డాన్స్ ఐకాన్ టైటిల్ ను గెలుచుకోండి. Photo : Twitter
జూన్ 22 నుండి ప్రారంభం కానున్న ఈ షో యొక్క డిజిటల్ ఆడిషన్స్ జులై 10 వరకు కొనసాగుతాయి. మీ వయస్సు 5 నుండి 50 మధ్యలో ఉన్నట్టయితే, మీరు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారైతే, మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. danceikon@oakentertainments.com అనే ఈమెయిల్ కు, 60 సెకండ్స్ మీ డాన్స్ వీడియోని మెయిల్ చేయండి. Photo : Twitter
ఈ షో యాంకర్ మరియు ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ, " ఈ షో ద్వారా నేను ఓటిటి ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహా కు ధన్యవాదములు. నేను ఎన్నో డాన్స్ షోస్ చేశాను, కానీ ఇది చాల డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ షో కంటెస్టెంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్స్ జీవితాల్ని కూడా మార్చేస్తుంది. Photo : Twitter
గెలిచిన కంటెస్టెంట్ యొక్క కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో కి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అది ఎవరు అని మేము ఫినాలే లో చెప్తాము. అందుకే ఈ షో మీ కోసమే. మీరు డాన్స్ చేయగలరు అనుకుంటే తప్పకుండా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను." ఇంకా ఎందుకు ఆలస్యం, మీ డాన్స్ షూస్ వేసుకొని నచ్చిన పాటకి డాన్స్ చేసి - డాన్స్ ఐకాన్ అనిపించుకోండి.. అంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. Photo : Twitter