Ram Gopal Varma Meets CM Jagan : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా ఆయన ఏదో ఒక విషయంలో ట్వీట్స్ వేస్తుంటారు. అందులో భాగంగా తాజాగా మరోసారి ఓ సంచలన ట్వీట్ చేశారు. తాను వ్యూహం అనే సినిమాను చేస్తున్నానని.. ఇది బయోపిక్ కాదనీ.. రియల్ పిక్ అని.. ఇందులో అన్ని నిజాలే ఉంటాయని.. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించినదే “వ్యూహం” కథ అని తెలిపాడు.. Photo : Twitter
జగన్‌తో భేటీ తర్వాత ఓ సినిమా ఉంటుందని అందరూ భావించారు. అది నిజం చేస్తూ.. రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్ వేదిగగా ప్రకటించారు. ఆయన తన ట్వీట్లో రాస్తూ.. నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు.. బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ , రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.. అంటూ ట్వీట్ చేశాడు. Photo : Twitter
అంతేకాకుండా ఆయన తన తదుపరి ట్వీట్లో రాస్తూ.. ఈ చిత్రం 2 పార్ట్స్‌గా రాబోతుంది.. మొదటి పార్ట్ “వ్యూహం”, 2nd పార్ట్ “శపథం”.. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “లో తగులుతుంది. వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్‌గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక , ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.. అంటూ ముగించారు. Photo : Twitter
అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు వచ్చే జనరల్ ఎలక్షన్స్‌ను టార్గెట్ చేసుకుని.. జగన్ ప్రభుత్వానికి సానుకూలంగా ఓ సినిమాను వర్మ భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వైస్ఆర్ జీవితంపై వచ్చిన యాత్ర సినిమా మాదిరిగా.. ఈ కొత్త సినిమా ఉండనుందని టాక్. ఇక వర్మ గతంలో కూడా జగన్‌కు అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఓ వివాదస్పద సినిమాను తీసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అమ్మరాజ్యంలో కడపబిడ్డలు అంటూ మరోకటి తీశారు. ఇక 2024 ఎన్నికలను రాబోతుండడంతో జగన్ పార్టీ ప్రచారంలో భాగంగా వర్మను దించుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి వర్మ తీయబోయే ఈ కొత్త సినిమా.. ఏమేరకు ఏపీ ప్రజల్నీ ప్రభావితం చేయగలదో.. Photo : Twitter
అయితే ఇక్కడ మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. ఒక పక్కా జగన్‌పై సినిమాతో పాటు మరో పవన్‌ను టార్గెట్ చేయడానికి వర్మను జగన్ వాడుకోబోతున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా విశాఖలో నిర్బంధించినా.. మంత్రులతో వ్యక్తిగత దాడి చేసినా పవన్ లో స్థైర్యం తగ్గడం లేదు. వైసీపీకి కొరకరాని కొయ్యగా మారుతున్నారు పవన్. Photo : Twitter
ఇక వర్మ సినిమాల విషయానికి వస్తే.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాలను తీస్తూనే ఉంటారు. అందులో భాగంగా ఆయన కొండా అంటూ ఓ సినిమాను తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సినిమా తర్వాత ఆయన నుంచి వచ్చిన మరో చిత్రం, లడ్కీ: డ్రాగన్ గర్ల్. ఈ సినిమాను వర్మ జూలై 15, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లడ్కీలో నటి పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించారు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో ట్రెండింగ్‌లో ఉండే రామ్ గోపాల్ వర్మ ఇటీవల మరోసారి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వర్మ, అప్పట్లో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్‌పై బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. అంతేకాదు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో వర్మపై ఫిర్యాదు చేశారు. ఓ మహిళ పట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. Photo : Twitter