Aryan Khan: వొడ్కా వ్యాపారంలో దిగిన ఆర్యన్ ఖాన్.. అంతా షాక్ !
Aryan Khan: వొడ్కా వ్యాపారంలో దిగిన ఆర్యన్ ఖాన్.. అంతా షాక్ !
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు, గతంలో డ్రగ్స్ కేసు చిక్కుకున్న ఆర్యన్ ఇప్పుడు బిజినెస్ పై ఫోకస్ పెట్టాడు, తాజాగా అతడు వొడ్కా వ్యాపారంలో దిగాడు.
దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని ప్రకటించిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇప్పుడు మరో భారీ ఎనౌన్స్మెంట్ చేశాడు. ఆర్యన్ ఖాన్ ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నాడు.
2/ 7
షారుఖ్ ఖాన్ ,గౌరీ ఖాన్ దంపతుల 25 ఏళ్ల కుమారుడు తన భాగస్వాములతో కలిసి భారతదేశంలో ప్రీమియం వోడ్కా బ్రాండ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం ఆర్యన్, అతని భాగస్వాములు ప్రపంచంలోనే అతిపెద్ద మద్యం కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
3/ 7
తాజాగా ఆర్యన్ ఖాన్ తన తొలి చిత్రాన్ని దర్శకుడిగా చేస్తానని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. అందరూ ఆర్యన్‌ను అభినందించారు. తన తండ్రిలా నటించాలనే ఆసక్తి తనకు లేదని ఆర్యన్ గతంలోనే చెప్పాడు. ఇప్పుడు దర్శకరంగంతో పాటు.. ఆర్యన్ పలు రంగాల్లో ఎంట్రీ ఇచ్చి బిజినెస్ చేయాలని సిద్ధమవుతున్నాడు.
4/ 7
మింట్ నివేదిక ప్రకారం, ఆర్యన్ బంటీ సింగ్ మరియు లేటీ బ్లాగోవాతో కలిసి ప్రీమియం వోడ్కా బ్రాండ్‌ను ప్రారంభించి, ఆ తర్వాత బ్రౌన్ స్పిరిట్ పరిశ్రమలోకి అడుగుపెడతాడు.
5/ 7
ఇందుకోసం స్లాబ్ వెంచర్స్ అనే కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద లిక్కర్ కంపెనీ ఏబీ ఇన్బైతో ఒప్పందం కుదుర్చుకుంది
6/ 7
నివేదిక ప్రకారం, స్లాబ్ వెంచర్స్ దేశంలో ఎక్కువ మంది సంపన్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. ఆల్కహాలిక్ మరియు నాన్-ఆల్కహాలిక్ పానీయాలు, దుస్తులు మరియు ఉపకరణాలతో సహా ఇతర ప్రీమియం వినియోగదారుల విభాగాలతో పాటు మరిన్ని రకాలను విక్రయించాలని యోచిస్తోంది.
7/ 7
షారుక్ ఖాన్ మరియు గౌరీ ఖాన్ల పెద్ద కుమారుడు ఆర్యన్. అతని సోదరి సుహానా ఖాన్ జోయా అక్తర్ తీస్తున్న ది ఆర్చీస్ తో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది.