2021లో చివర్లో అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘పుష్ప’ మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో రఫ్పాడించారు. అక్కడ ఏకండా రూ. 80 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 167 కోట్ల షేర్‌తో పాటు రూ. 320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి 2021లో మన దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ ఇయర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో బాలీవుడ్లో సత్తా చాటాడానికీ రెడీ అవుతున్నారు. (Twitter/Photo)
అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘పుష్ప’ (Puspa) మూవీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. 2021లో రూ. 320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ ఫాలోయర్స్ ఉన్న దక్షిణాది నటుడిగా రికార్డు క్రియేట్ చేసారు.