Adivi Sesh - Vishwak Sen- Siddhu Jonnalagadda: ఎవరో వస్తారని ఏదో చేస్తారని.. బ్రేక్ కోసం ప్రస్తుతం ఉన్న హీరోలు వెయిట్ చేయడం లేదు. తమ కథలను తామే రాసుకోవడమే కాకుండా.. అవసరమైతే.. మెగాఫోన్ పట్టుకుంటున్నారు. దర్శకుడికి కథలు రాసే అలవాటు ఉంటే సినిమా చాలా బాగా వస్తుందంటారు. ఎందుకంటే రైటర్ డైరెక్టర్ అయితే ఉండే లాభాలు వేరు. (file/photo)
మరీ ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న కుర్ర హీరోలు మరో రైటర్‌పై ఆధారపడటం లేదు. ఎవరో వచ్చి తమకు బ్రేక్ ఇస్తారనే నమ్మకం కూడా పెట్టుకోవడం లేదు. తమ కథలు తామే రాసుకుని.. కుదిర్తే మాటలు, స్క్రీన్ ప్లే కూడా వాళ్ళే సిద్ధం చేసుకుంటున్నారు. దర్శకత్వ బాధ్యత మాత్రం మరొకరికి ఇస్తున్నారు. తెలుగులో అడివి శేష్, విశ్వక్ సేన్, నవీన్ పొలిశెట్టి, సిద్ధు, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా రైటింగ్లోనూ సత్తా చూపిస్తున్నారు. (Photo/Twitter)
1. అడవి శేష్: క్షణం, గూడఛారి లాంటి సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు అడవి శేష్. అలాగే ఎవరు సినిమాకు ఈయనే స్క్రీన్ ప్లే అందించాడు.ఈ యేడాది విడుదలైన ‘మేజర్’ మూవీకి కూడా అడివి శేష్.. కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఈ సినిమా జూన్ 3న విడుదలైన సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. మొత్తంగా బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంది. ఈయన ముందుగా కర్మ, కిస్ సినిమాలతో మెగాఫోన్ కూడా పట్టుకున్నాడు. మొత్తంగా అడివి శేష్.. తన స్టోరీలతోనే హీరోగా సత్తా చూపెడుతున్నాడు. (File/Photo)
5. విశ్వక్ సేన్: పాతికేళ్లకే ఫలక్ నుమా దాస్ సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు విశ్వక్ సేన్. నన్ను నేనే లేపుకుంటా అంటూ వచ్చేసాడు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శకుడు ఆయనే. ఈయేడాది ఈయన ‘అశోకవనంలో అర్జుున కళ్యాణం’ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. తాజాగా ‘ఓరి దేవుడా’ సినిమాతో పలకరించాడు. (File/Photo)