Adivi Sesh - Hit 2 : మేజర్ సినిమా తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన మూవీ హిట్ 2. ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా ఇపుడు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. అంతేకాదు ఇప్పటికే థియేట్రికల్ రన్ అన్ని ఏరియాల్లో ముగిసింది. ఈ సందర్భంగాఈ సినిమా వాల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. (Twitter/Photo) (HIT2 Twitter Review Photo : Twitter)
మొదటి ‘హిట్’ సినిమా కేస్ 1లో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్లో శేష్ నటించాడు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. హిట్ 1 కూడా ప్రైమ్ వీడియోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ సినిమా స్ట్రీమింగ్కు రానుంది. (Twitter/Photo)
ఇక హిట్ 2 కథ విషయానికి వస్తే.. హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్‌ను చేధించాడు అనేది థ్రిల్లింగ్‌గా చూపించారు.. దీనికి తోడు సౌండ్, పిశ్చర్ అదిరిపోయింది. సినిమా హిట్ అని అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ చిత్రానికి ఎంఎం.శ్రీలేఖ మరియు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, జాన్ స్టీవర్ట్ ఎడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. (Twitter/Photo)
తెలంగాణ (నైజాం)లో రూ. 7.54 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో రూ. 1.67 కోట్లు.. ఉత్తరాంధ్ర ...రూ. 2.04 కోట్లు.. ఈస్ట్ గోదావరి.. రూ. 1.01 కోట్లు.. వెస్ట్ గోదావరి .. రూ. 0.67కోట్లు.. గుంటూరు.. రూ. 1.06 కోట్లు.. కృష్ణ.. రూ. 0.98 కోట్లు.. నెల్లూరు.. రూ. 0.57 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్.. రూ 15.54కోట్లు (26.80 కోట్లు గ్రాస్) వసూళ్లు.. కర్ణాటక + రెస్టాఫ్ భారత్.. రూ. 2.66 కోట్లు.. ఓవర్సీస్.. రూ. 4.55 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.75 కోట్లు (రూ. 42.50 కోట్లు గ్రాస్) వసూళ్లు సాధించింది. రూ. 14.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రూ. 7.75 కోట్ల లాబాలతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
అడివి శేష్ నటించిన హిట్ 2 థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో - రూ. 4.00 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) - రూ. 1.75 కోట్లు.. ఆంధ్ర - రూ. 4.50 కోట్లు తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి - రూ. 10.25 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ - రూ. 1.50 కోట్లు ఓవర్సీస్ - రూ. 2.50 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 14.25 కోట్లు బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 15 కోట్లు రాబట్టాలి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అడివి శేష్ కెరీర్లో ఇదే హైయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
అడివి శేష్ గత చిత్రాల విషయానికొస్తే. మేజర్ మూవీ రూ. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ తర్వాత ‘ఎవరు’ మూవీ రూ. 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అటు ‘గూఢచారి’ రూ. 5 కోట్ల బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా హిట్ 2 మూవీ అడివి శేష్ కెరీర్లోనే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
ఓ ఛాలెంజింగ్ కేస్ దొరికితే ఎలా ఉంటుంది.. అప్పుడు కృష్ణదాస్ నటిస్తున్న శేష్‌గా ఎలా ఆ కేసును సాల్వ్ చేశారు అనేది సినిమా. ఇక ఈ సెకండ్ పార్ట్‌లో మరింతగా యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీని ప్రశాంతి త్రిపురనేని, హీరో నానిలు కలిసి నిర్మించారు. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా.. హిట్ 2 ఏపీ నేపథ్యంగా తెరకెక్కింది. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా కనువిందు చేసింది. మొత్తంగా 2022లో అడివి శేష్ కెరీర్లో 2 సూపర్ హిట్స్‌తో వెరీ స్పెషల్‌గా నిలిచింది. (Twitter/Photo)