ఈ ఏడాది మేజర్‌తో పాన్ ఇండియా రేంజ్లో సూపర్‌హిట్ కొట్టిన అడివిశేష్.. హిట్-2తో మరో బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. గతంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ ఇది సీక్వెల్. మొదటి భాగాన్నే తెరకెక్కించిన శైలేష్ కొలను హిట్2 ను కూడా మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమింట్స్‌తో ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.
హిట్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. హిట్2 సినిమా సినిమా హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ పోటీ పడగా భారీ ధరకు అమెజాన్ సంస్థ దక్కించుకుంది. అయితే నిన్నటి నుంచి రెంట్ ప్రాతిపదికన హిట్ 2 మూవీ స్ట్రీమింగ్కు వచ్చింది.