Adivi Sesh - Hit 2 Pre Release Theatrical Business : మేజర్ సినమా తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో హిట్ 2. ఇది హిట్‌కు సీక్వెల్‌గా వస్తోంది. హిట్ 1లో విశ్వక్సేన్ హీరోగా నటించారు. హిట్ 2 మూవీ సెన్సార్ నుంచి A సర్ఠిఫికేట్ పొందిన ఈ చిత్రం థియేట్రికల్‌గా మంచి బిజినెస్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని స్క్రీన్స్‌లో విడుదల కాబోతుందంటే.. (Twitter/Photo)
మొదటి ‘హిట్’ సినిమా కేస్ 1లో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్లో శేష్ నటించాడు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలకానుంది. ట్రైలర్, టీజర్స్‌తో ఆకట్టుకుంటోన్న హిట్ 2 మూవీ ప్రిరీలిజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అటు నాని, హిట్ సినిమాలో నటించిన విశ్వక్ సేన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. (Twitter/Photo)
హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్‌ను చేధించాడు అనేది థ్రిల్లింగ్‌గా చూపించనున్నారు. దీనికి తోడు సౌండ్, పిశ్చర్ అదిరిపోయింది. సినిమా హిట్ అని అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ చిత్రానికి ఎంఎం.శ్రీలేఖ మరియు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, జాన్ స్టీవర్ట్ ఎడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. (Twitter/Photo)
అడివి శేష్ నటించిన హిట్ 2 థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో - రూ. 4.00 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) - రూ. 1.75 కోట్లు.. ఆంధ్ర - రూ. 4.50 కోట్లు తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి - రూ. 10.25 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ - రూ. 1.50 కోట్లు ఓవర్సీస్ - రూ. 2.50 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 14.25 కోట్లు బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 15 కోట్లు రాబట్టాలి. హీరోగా అడివి శేష్ కెరీర్లో ఇదే హైయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
అడివి శేష్ గత చిత్రాల విషయానికొస్తే. మేజర్ మూవీ రూ. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటు ఎవరు మూవీ రూ. 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అటు గూఢచారి రూ. 5 కోట్ల బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా హిట్ 2 మూవీ ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమా నుంచి రొమాంటిక్ వీడియో సాంగ్ ఉరికే.. ఉరికే.. (Urike Urike song) ఇటీవల విడుదలైంది. రొమాంటిక్‌గా సాగే ఈ పాటకు శ్రీలేఖ సంగీతం అందించారు. కృష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. సిద్ శ్రీరామ్, రమ్య పాడారు.. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. (Twitter/Photo)
అడివి శేష్ నటించిన ‘హిట్ 2’ మూవీ తెలంగాణ (నైజాం)లో 201 పైగా థియేటర్స్‌లో విడుదల కానుంది. మరోవైపు సీడెడ్ (రాయలసీమ)లో 90 + ఆంధ్రప్రదేశ్ -245 + థియేటర్స్‌లో తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్‌లో కలిపి 550 పైగా థియేటర్స్‌లో విడుదల కానుంది. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ = 85 ఇక ఓవర్సీస్లో 320 స్క్రీన్స్‌లో హిట్2 విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 955 స్క్రీన్స్‌లో ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. (Twitter/Photo)
ఓ ఛాలెంజింగ్ కేస్ దొరికితే ఎలా ఉంటుంది.. అప్పుడు కృష్ణదాస్ నటిస్తున్న శేష్‌గా ఎలా ఆ కేసును సాల్వ్ చేశారు అనేది సినిమా. ఈ టీజర్లో రావు రమేష్, ఖిలాడి ఫేమ్ మీనాక్షి చౌదరిలు కనిపించారు. ఇక ఈ సెకండ్ పార్ట్‌లో మరింతగా యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయని అంటున్నారు దర్శకుడు.. ఈ మూవీని ప్రశాంతి త్రిపురనేని, హీరో నానిలు కలిసి నిర్మించారు. (Twitter/Photo)