ఏం జరిగిందో ఏమో కానీ మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎవరి దిష్టి తగిలిందో అర్థం కావడం లేదంటూ అదిరే అభి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బర్దస్త్ టీం అంతా సంతోషంగా, ఓ కుటుంబంలా ఉండేవాళ్లమని.. మాది జబర్దస్త్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీకి ఎవరో దిష్టి పెట్టారంటూ అభి కామెంట్ చేశాడు.
స్టేజ్ ఎక్కేవరకూ రిహార్సల్స్ అయినా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతిక వేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు.. ఎవరి దిష్టి తగిలిందో, ఎవరైనా పల్లెత్తు మాట అంటే పడని మేము.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం అని అభి అన్నాడు.