సాధారణంగా గర్భవతులెవరైనా ఇంటి నుంచి అడుగు బయటపెట్టరు. ఆస్పత్రికి వెళ్లొస్తేనో లేక.. మరేదైనా అర్జంట్ అయితే తప్ప వారు గృహాన్ని వీడి బయటకు రారు. ఈ సమయంలో వారికి విశ్రాంతి ఎంతో అవసరం. కానీ ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మలు మాత్రం.. గర్భవతులైనా పనికి ప్రాధాన్యతనిచ్చారు.
బాలీవుడ్ లో పలువురు హీరోయిన్లు గర్భవతులుగా ఉన్నా షూటింగ్ లలో పాల్గొన్నారు. వారిని ఇక్కడ చూద్దాం.
2/ 10
అనుష్క శర్మ.. బాలీవుడ్ బ్యూటీ, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నది. కాగా అనుష్క శర్మ ఇటీవలే ఒక యాడ్ లో నటించిన విషయం తెలిసిందే. Prega News యాడ్ లో ఆమె నటించింది.
3/ 10
కరీనా కపూర్ ఖాన్.. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ కు వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని శంకించాల్సిన పన్లేదు. ఆమె మొదటి, రెండో సంతానం సమయంలోనూ షూటింగ్స్ లో పాల్గొంది.
4/ 10
శ్రీదేవి.. అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఆమె గర్భవతి గా ఉన్న సమయంలో ఒక సినిమాలో నటించారు. జుడాయి సినిమా చేసే సమయంలో ఆమె ఆరు నెలల గర్భవతి. కొన్నాళ్ల తర్వాత ఆమె జాహ్నవి కపూర్ కు జన్మనిచ్చింది.
5/ 10
ఫరా ఖాన్.. బాలీవుడ్ డాన్స్ మాస్టర్, డైరెక్టర్ ఫరా ఖాన్ కూడా తాను దర్శకత్వం వహించిన ఓంశాంతి ఓం సినిమా సయమంలో గర్భవతే. ఈ సినిమాలో ఆమె మిత్రుడు, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరో. దీపికా పదుకునే హీరోయిన్.
6/ 10
కాజోల్.. కలల రాణి కాజోల్ కూడా గర్భవతిగా ఉన్న సమయంలో ఒక సినిమా లో నటించారు. ‘వి ఆర్ ఫ్యామిలీ’ సినిమా చేస్తున్న సమయంలో ఆమె ప్రెగ్నెంట్.
7/ 10
జయా బచ్చన్.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్ షోలే సినిమా చేస్తున్న సమయంలో గర్భవతి.
8/ 10
కొంకణా సేన్... బాలీవుడ్ లో కొంకణా సేన్ ది ప్రత్యేక శైలి. ఆమె తన విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. 2010 లో ఆమె నటించిన ‘రైట్ యా రాంగ్’ చేస్తున్న సమయంలో ఆమె గర్భవతి.
9/ 10
నందితా దాస్.. విలక్షణ నటి నందితా దాస్ 2011 లో ‘ఐ యామ్’ సినిమా చేస్తున్నప్పుడు గర్భవతి గా ఉన్నారు.
10/ 10
జుహీ చావ్లా... అందాల తార జూహీ చావ్లా తన మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో ఏకంగా మూడు సినిమాలు చేసింది. అవి ‘ఏక్ తా రిష్తా’, ‘ఆమ్దానీ అత్తని ఖర్చా రుపాయా’, ‘ఝాంకర్ బీట్స్’..