కాంతార సినిమాపై ప్రశంసలకు బ్రేక్ పడటం లేదు. ఈ సినిమా విడుదలై రెండునెలలు గడుస్తున్నా... ఇంకా హాట్ టాపిక్‌గానే మారింది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు కాంతారపై ప్రశంసల వర్షం కురిపించారు. కాంతార క్లైమాక్స్ చాలా బావుందని పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మొదటగా.. ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో దేశ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ రీచ్ అయ్యింది. Photo : Twitter
స్టార్ హీరోయిన్ త్రిష ఈ మూవీ పై తన ఇన్‌స్టాగ్రమ్ ద్వారా పొగడ్తలు కురిపించారు. కాంతరా చూశానని, తనకు ఎంతో నచ్చిందని పోస్ట్ పెట్టిన త్రిష, మూవీ హీరో కం డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి కి హీరోయిన్ సప్తమి గౌడ కు అలానే నటుడు కిషోర్ కుమార్ సహా యూనిట్ మొత్తానికి తన తరపున కాంతారా బిగ్ సక్సెస్ పై ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు.
ఇక ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా.. అగ్నీస్ లోకనాథ్ సంగీతం అందించారు. కెజీయఫ్ నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రోడ్యూస్ చేశారు. సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన ‘కాంతార’ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుని ఇప్పటికీ కన్నడ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా కేవలం మౌత్ పబ్లిసిటీతోనే.. జనాల్లోకి వెళ్లింది.