హిందీ సీరియళ్లలో నటించే శివ పఠానియా బయటపెట్టిన ఓ ఉదంతం షాకిస్తోంది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఫేస్ చేశానని ఆమె చెప్పింది. హమ్ సఫర్ షో ముగిశాక నెక్ట్స్ ఏంటన్నది తోచని సమయంలో అవకాశాలు లేక దాదాపు ఎనిమిది నెలల పాటు దిక్కు తోచక ఉండిపోయానని, అయితే ఆ సమయంలోనే తనకు కాస్టింగ్ కౌచ్ ఎదురైందని చెప్పింది.