Roshni Walia: అందానికి అభినయం తోడైతే అవకాశాలు అవే వస్తాయి. అందుకు ఉదాహరణ బాలీవుడ్ క్యూట్ గర్ల్ రోష్నీ వాలియా. టీవీలో యాడ్స్‌తో కెరీర్ ప్రారంభించి వెంటనే మై లక్ష్మీ తేరే ఆంగన్‌కీ వంటి టీవీ షోల్లో మెరిసిన ఈ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ బ్యూటీ... ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆర్మీ ఫ్యామిలీ నుంచీ వచ్చిన రోష్నీ... 2012లో మై ఫ్రెండ్ గనేశా 4తో... బాల నటిగా సినిమాల్లో కెరీర్ వెతుక్కుంది. ఆ తర్వాత మచ్లీ జల్ కీ రాణీ హై, ఫిరంగి సినిమాల్లో చేసింది. 2019లో డాటర్ ఆఫ్ కచ్‌తో మెరిసింది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ తన ఫోటో షూట్ లు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అలానే ఇప్పుడు ఆమె కొన్ని ఫోటోలు షేర్ చెయ్యగా అవి వైరల్ గా మారాయ్.