Home » photogallery » movies »

ACTRESS REGINA CASSANDRA BUSY IN KOLLYWOOD WITH SIX OFFERS AK

రెజీనాకు కలిసొచ్చిన కాలం... రెండేళ్లు బిందాస్..

హీరోయిన్లకు ఎప్పుడు కాలం కలిసొస్తుందో చెప్పలేం. తెలుగులో దాదాపుగా ఫేడౌట్ అయిపోయిన రెజీనా కెరీర్ మళ్లీ పుంజుకోవడం కష్టమే అనుకున్నారు టాలీవుడ్ జనం. అయితే ఎవరు సినిమాలో నెగెటివ్ రోల్ లోనూ మెప్పించిన రెజీనాకు తమిళ్ లో మాత్రం వరుస ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో తెలుగులో నెగిటివ్ రోల్స్.. తమిళంలో పాజిటివ్ రోల్స్ అన్న విధంగా అమ్మడి కెరీర్ సాగుతోంది. నిజానికి రెజీనా తమిళంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పొతుంది. దాదాపుగా 6 తమిళ సినిమాలు రెజీనా చేతిలో ఉన్నాయని సమాచారం. దీంతో మరో రెండేళ్ల పాటు కోలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ కెరీర్‌కు డోకాలేదనే టాక్ వినిపిస్తోంది.