బూరె బుగ్గల రాశీఖన్నాకు ప్రస్తుతం ఏదీ కలిసిరావడం లేదు. వరుసగా అన్ని సినిమాల ఫ్లాప్స్ అవుతున్నాయి. మొన్న పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుందని అనుకుంటే ఈ సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ భామ నటించిన మరో లేటెస్ట్ సినిమా థాంక్యూ. నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా పాజిటివ్ బజ్‌తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. దీంతో రాశీ ఖన్నా విషయంలో ఓ సెంటిమెంట్ ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చింది. Photo : Instagram
విషయం ఏమంటే.. ఈ అందాల చిన్నది ఏదైనా సినిమాలో హీరోతో లిప్ లాక్ చేస్తే ఆ మూవీ ఫలితం తుస్సుమంటదనేది సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అంతేకాదు కొందు నెటిజన్స్.. దీనికి కొన్ని ఉదాహారణలు కూడా ఇస్తున్నారు. రాశీ ఖన్నా 2013లో ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రాశీ ఖన్నా, జాన్ అబ్రహంతో కాస్తా హాట్ హాట్‌గా నటించడమే కాదు.. ముద్దు కూడా ఇస్తుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమందని ట్రోల్ చేస్తున్నారు. Photo : Instagram
ఇక ఆ తర్వాత తెలుగులో గోపీచంద్ జిల్.. సందీప్ కిషన్‌తో ‘జోరు’, రవితేజ ‘బెంగాల్ టైగర్’, ‘టచ్ చేసి చూడు’, రామ్ పోతినేని ‘శివమ్’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఇక లేటెస్ట్గా వచ్చిన నాగ చైతన్య ‘థ్యాంక్యూ’.. ఈ సినిమా అన్నింటీలోను రాశీఖన్నా లిప్ లాక్స్ ఉంటాయని... అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా ఆకట్టుకోలేదని.. ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం రాశీ ఖన్నా ముద్దే అని చర్చించుకుంటున్నారు. Photo : Instagram
అది అలా ఉంటే రాశీ ఖన్నా ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ భామ ఇటీవల రుద్ర అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్ర నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయినప్పటికీ చేశారట. అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకునే ముందు ఆమె భయపడ్డారట. Photo : Instagram
సౌత్‌లో హీరోయిన్గా చేస్తుండడంతో అక్కడ పాజిటివ్ ఇమేజ్ ఉంది.. దీంతో రుద్రలో నెగటివ్ పాత్రను చూసి ఎలా రియాక్ట్ అవుతారో అని కొంచెం డౌట్ ఉండేదని తెలిపింది. అయితే ఈ పాత్ర కోసం తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి రుద్ర చేశానని తెలిపింది. తన క్యారెక్టర్ చాలామందికి నచ్చిందని.. యాక్టర్‌కు ఎంగరేజ్మెంట్ ఉంటే వీలున్నప్పుడల్లా ఇలాంటీ కొత్త పాత్రల్లో నటించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. Photo : Instagram
ఇక ఆమె తెలుగు సినిమాల విషయానికి వస్తే.. అందాల రాశీ ఖన్నా తాజాగా ‘పక్కా కమర్షియల్’ సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మిక్స్’డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాశీఖన్నా మాట్లాడుతూ.. సినిమాలో తనకు నచ్చని డైలాగ్స్ ఉంటే మొహమాటం లేకుండా చెబుతుందట. అంతేకాదు ఆమె సెట్లో అలా చాలాసార్లు చెప్పారట. అయితే తన మాటలను కొద్దిమంది దర్శకులు వింటారు, కొందరు వినరని తెలిపింది. Photo : Instagram
ఇక రాశీఖన్నా కెరీర్ విషయానికి వస్తే... ఈ మధ్య ఆమె సినీ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. మొదటి నుంచి కూడా రాశీ ఖన్నా తన కెరియర్ విషయంలో అంతగా దూకుడు చూపించలేదు. తనవంతుగా గ్లామర్ విషయంలో గానీ, లేక నటన, డాన్స్ విషయంలో గానీ చేయాల్సింది అంతా చేసినా.. సినిమాల ఫలితాలు మాత్రం ఆమెకు కలిసిరావడం లేదు.. Photo : Instagram
ఇక పక్కా కమర్షియల్ సినిమా విషయానికి వస్తే.. మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. టీజర్స్, ట్రైలర్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా బాక్పాఫీస్ దగ్గర తుస్సుమంది Photo : Instagram
ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్.మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి, బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కించారు. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్గా చేసింది. Photo : Instagram
ఇక అది అలా ఉంటే ఆ మధ్య రాశీ ఖన్నా.. దక్షిణాదిలో తాను ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నానని, అక్కడ తన టాలెంట్‌కు తగిన రోల్స్ రాలేదంటూ, అక్కడ హీరోయిన్స్‌ను మిల్కీ బ్యూటీ, డాల్స్ అంటారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారని గత ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో సౌత్ ఫిల్మ్ ఇండిస్ట్రీ ఫ్యాన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు.. Photo : Twitter
ఈ నేపథ్యంలో తన గురించి వస్తోన్న నెగటివ్ ప్రచారంపై ఆమె తాజాగా స్పందించారు. దీనికి సంబంధించి ఆమె ఓ ట్వీట్ చేశారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటూ.. దక్షిణాది చిత్ర పరిశ్రమను దూషిస్తూ తాను వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. భాష ఏదైనా.. సినిమా ఏదైనా, తాను చేసే ప్రతి సినిమాపై గౌరవం మర్యాద ఉంటుందన్నారు. దయచేసి ఆ ప్రచారాలను ఇకనైనా ఆపండంటూ ఆ వివాదానికి ముగింపు పలికారు రాశీ ఖన్నా. . Photo : Twitter
అందులో భాగంగా ఆమె వరుసగా.. ‘జిల్’, ‘జోరు’, ‘సుప్రీమ్’, ‘బెంగాల్ టైగర్’ ‘హైపర్’, ‘తొలిప్రేమ’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాల్లో నటించి అదరగొట్టారు. ప్రస్తుతం రాశీ ఖన్నా తెలుగులో థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో వస్తున్న పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. Photo : Twitter
ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ మారుతి కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్ చిత్రంతో పాటు నాగచైతన్య విక్రమ్ కుమార్ థాంక్యూలో కూడా హీరోయిన్గా చేస్తోంది. ఇక అది అలా ఉంటే రాశీ ఖన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను అదరగొడుతోంది. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా.. తాజాగా మరో వెబ్ సిరీస్‌లో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. Photo : Instagram
తాజాగా ఈమె అజయ్ దేవ్‌గణ్ మొదటి సారి నటించిన వెబ్ సిరీస్ ‘రుద్ర’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. రీసెంట్గా విడుదల చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ మార్చి 4 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో పాటు షాహిద్ కపూర్ లీడ్ రోల్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. (Instagram/Photo)