హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ముద్దుముచ్చట్లలో అందాల తార ప్రియమణి

ముద్దుముచ్చట్లలో అందాల తార ప్రియమణి

ప్రియమణి తెలుగులో జగపతి బాబు హీరోగా వచ్చిన 'పెళ్లైన కొత్తలో' సినిమాతో తెలుగువారికి మరింత పరిచయమైంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'యమదొంగ' సినిమాల ద్వారా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత చాలా చిత్రాల్లో ఆమె నటించారు. అయితే ఆమె నటించిన సినిమాలు కొన్ని సరిగా అలరించకపోవడం.. కొత్త హీరోయిన్స్ నుండి పోటీ కారణంగా ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇంతలో ఆమె పెళ్లి చేసుకుంది. ప్రియమణి తన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది. అందులో భాగంగా.. భర్త ముస్తాఫా రాజ్‌తో దిగిన ఫోటోలను..వారీ మద్య ఉన్న అన్యోన్యతను ఫోటోల రూపంలో ప్రేక్షకులతో పంచుకుంటుంది. ప్రియమణి..ప్రస్తుతం తెలుగులో వేణు ఊడుగుల దర్శకత్వంలో నటించనుందని టాక్. ఈ సినిమాకి 'విరాటపర్వం 1992' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

Top Stories