Actress Pragathi : తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. నటి ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. అలా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. Photo : Instagram
అది అలా ఉంటే ఆమె ఇటీవల ఓ ఇంటర్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. తన సినీ కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, దర్శక నిర్మాతలే కాకుండా ఒక స్టార్ హీరో కూడా రోజంతా తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదట ప్రగతి. ఇండస్ట్రీలో కొందరు ఫీమేల్ ఆర్టిస్టులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపినట్లు సమాచారం. Photo : Instagram
ఇక మరోవైపు ప్రగతి ముఖ్యంగా పోయిన లాక్డౌన్లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. అప్పటి నుంచి తరచూ ఫిటినెస్ వీడియోలతో పాటు పలు డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు. తాజాగా పుష్ప సినిమాలోని ఊ అంటావా పాటకు అదిరిపోయే స్టెప్పులతో కేకపెట్టించారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Instagram
తాజాగా ప్రగతి హీరోయిన్ మెహ్రీన్‌తో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రాస్తూ.. పనిచేసే చోట స్నేహబంధం అల్లుకుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుందని పేర్కొన్నారు. సినిమాలో కూతురు కాస్తా నిజజీవితంలోనూ తన కూతురు అయింది అంటూ మెహ్రీన్ ని తన బిడ్డగా భావిస్తున్నట్టు తెలిపారు ప్రగతి. ఇదంత దేనికి అంటే ఎఫ్2 చిత్రంలో ప్రగతి, మెహ్రీన్ తల్లీకూతుళ్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య బాండ్ అలా కొనసాగుతోందట. దీంతో మెహ్రీన్ తన కూతురు లాంటిదని తెలిపారు ప్రగతి. ఈ ఇద్దరు కలిసి ప్రస్తుతం ఎఫ్ 3లో నటిస్తున్నారు. Photo : Instagram
ప్రగతికి హీరోయిన్ రెజీనాతో కూడా మంచి అనుబంధం ఉందట. ఈ విషయాన్ని ప్రగతి గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. రెజీనా తన కూతురు వంటిదని చెప్పారు. తనను రెజీనా అమ్మ అనే పిలుస్తుందని అన్నారు. సాయితేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం నుంచి రెజీనాకు తనకు మధ్య మంచి బంధం ఏర్పడిందని తెలిపారు. Photo : Instagram
మెహ్రీన్, రెజీనా మాత్రమే కాదు.. గోవా బ్యూటీ ఇలియానా కూడా ప్రగతితో మంచి బంధాన్ని ఏర్పరచుకున్నారట. పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం నుంచి ప్రగతి, ఇలియానా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారట. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇలియాన హెయిర్ డ్రస్సర్ రాకపోతే ప్రగతి దగ్గరుండి ఇలియానాకు రెండు జడలు వేసారట. Photo : Instagram
ఇక ప్రగతి సినిమాల విషయానికి వస్తే.. తెలుగు సినిమాల్లో ప్రగతి ముఖ్యంగా అమ్మగా, వదినగా, అక్కగా, చెల్లిగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇక ఎఫ్ 3 విషయానికి వస్తే.. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. Photo : Instagram
ముఖ్యంగా పోయిన లాక్డౌన్లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ప్రగతి అప్పటి నుంచి తరచూ ఫిటినెస్ వీడియోలతో పాటు పలు డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు. ఇక అది అలా ఉంటే.. తాజాగా హీరోయిన్ మెహ్రీన్‌తో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రాస్తూ.. పనిచేసే చోట స్నేహబంధం అల్లుకుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుందని పేర్కొన్నారు. Photo : Instagram