పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నారు. మలయాళీ అందం పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఇక ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయారు. Photo : Instagram
ఇటీవల పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. అందులో భాగంగా ’సిల్లీ ఫెలోస్’ ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క స్మాల్ స్క్రీన్‌పై కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఈ భామ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్ణ యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. Photo : Instagram
అందులో భాగంగా పూర్ణ ఇటీవల దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి సందర్భంగా పూర్ణ భర్త ఇచ్చిన కానుకల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్ణ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అది అలా ఉంటే తాజా సమాచారం మేరకు నటి పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఇచ్చాడట. పెళ్లికి ముందే ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చాడట. Photo : Instagram
దీని విలువ దాదాపుగా రూ. 1.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు దుబాయ్‌లో ఓ లగ్జరీ ఇల్లును కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ దాదాపు రూ. 25 కోట్లు వరకూ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇవే కాకుండా ఓ మంచి కారు, కొన్ని కంపెనీల షేర్స్ కూడా కానుకలుగా ఇచ్చాడట. వీటి విలువ 30 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Instagram
నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. Photo: Instagram.com/shamnakasim
భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు. అఖండ సినిమా 6 వారాల్లో రూ. 73 కోట్లకు పైగా షేర్ (130 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. Photo: Instagram.com/shamnakasim
దీనికి తోడు ‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ అఖండ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అందులో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తోంది. Photo: Instagram.com/shamnakasim