పూర్ణ.. అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తాజాగా ఈమె దీపావళి రోజున తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. Photo : Instagram
పూర్ణకు భర్త భారీగానే బంగారం పెట్టినట్లు సమాచారం. పూర్ణ ఇటీవల దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి సందర్భంగా పూర్ణ భర్త ఇచ్చిన కానుకల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్ణ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
దీంతో పాటు దుబాయ్‌లో ఓ లగ్జరీ ఇల్లును కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ దాదాపు రూ. 25 కోట్లు వరకూ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇవే కాకుండా ఓ మంచి కారు, కొన్ని కంపెనీల షేర్స్ కూడా కానుకలుగా ఇచ్చాడట. వీటి విలువ 30 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Instagram