పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నారు. మలయాళీ అందం పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఇక ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయారు. Photo : Instagram
ఇటీవల పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. అందులో భాగంగా ’సిల్లీ ఫెలోస్’ ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క స్మాల్ స్క్రీన్‌పై కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఈ భామ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్ణ యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. Photo : Instagram
అంతేకాదు పూర్ణ, అసిఫ్ అలీ ఎంగేజ్మెంట్ కేరళలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించి పూర్ణ కొన్ని ఫోటోలను, ఓ వీడియోను పంచుకున్నారు. ఈ పెళ్లిని క్యాన్సల్ చేసుకుంటున్న ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అలాంటీదేమీ లేదని పూర్ణ మరోసారి తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోలను పంచుకుని.. రూమర్స్‌కు చెక్ పెట్టింది.
ఇప్పటివరకు పూర్ణ దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 పైగా సినిమాల్లో నటించింది. నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండలో కూడా పూర్ణ నటించింది. Photo : Instagram