సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నరేష్.. త్వరలో ప్రముఖ నటి పవిత్రా లోకేష్ ను 4 వ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం గట్టిగా జరుగుతుంది. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. కన్నడ నటిగా పేరుతెచ్చుకున్నా ఆమె ఎక్కువ గుర్తింపు పొందింది టాలీవుడ్ లోనే.. స్టార్ హీరో హీరోయిన్లకు తల్లిగా, అత్తగా ఆమె నటించి మెప్పించింది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో తన పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అసభ్యమైన ఫోటోలు, తన ప్రతిష్టకు భాగం కలిగించే వార్తలను ప్రచారం చేస్తున్నారని, వాటి వలన తనకు ఇబ్బందఫై కలుగుతుందని తెలుపుతూ ఆమె సైబర్ నేరగాళ్లపై ఫిర్యాదు చేసింది. ఇక పవిత్రా ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. (ఇన్స్టాగ్రామ్ ఫోటో)
పవిత్రా లోకేష్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఆమె బెంగుళూరులో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా నివాసముంటుంది. 2007 లో సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న పవిత్రా మనస్పర్థల కారణంగా అతనికి విడాకులు ఇచ్చి ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలోనే నరేష్ ను ఆమె రెండో వివాహం చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు పవిత్రా.. నరేష్‌తో తన సహజీవనం గురించి క్లారిటీ ఇచ్చేసింది. నరేష్‌తో కలిసి ఆమె ఫాం హౌస్‌లోనే కలిసి ఉంటున్నట్లు తెలపింది. తమ కుటుంబ సభ్యురాలిగా నరేష్ ఇంట్లో వాళ్లు అంగీకరించారు. మా ఇద్దరి సహజీవనం, రిలేషన్‌షిప్‌కు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన ఫ్యామిలీ ఆమోదం తెలిపింది. అందుకే మేము పెళ్లి చేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నామన్నారు.