Nikki Galrani - Aadhi: నిక్కీ గల్రానీ, ఆది పెనిశెట్టి రిసెప్షన్.. హాజరైన సినీ ప్రముఖులు
Nikki Galrani - Aadhi: నిక్కీ గల్రానీ, ఆది పెనిశెట్టి రిసెప్షన్.. హాజరైన సినీ ప్రముఖులు
Nikki Reception: నిక్కీ గల్రానీ.. ఆది పినిశెట్టి వివాహం ఘనంగా రిగిన విషక్ష్ం తెలిసిందే. ఈ జంట రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
కన్నడ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించిన నిక్కీ గల్రానీ ప్రముఖ హీరో ఆది పినిశెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహ వేడుక ఇటీవలే ఘనంగా జరిగింది.
2/ 8
2015లో వచ్చిన యాగవరైనుం నా కాక్క చిత్రంలో ఈ జంట తొలిసారిగా కలిశారు. ఈ సినిమాను తెలుగులో మలుపుగా తీశారు. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది అది ప్రేమకు దారితీసింది.
3/ 8
ఈ జంట తరువాత మరగధ నానయం చిత్రంలో కలిసి నటించింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్నఈ జంట తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది.
4/ 8
సందీప్ కృష్ణన్, నానితో పాటు టాలీవుడ్,కోలివుడ్‌కు చెందిన పలువురు నటులు మే 19న వివాహ వేడుకలో పాల్గొన్నారు. రిసెప్షన్లో పలువురు కూడా పాల్గొన్నారు.
5/ 8
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, రాధిక శరత్ కుమార్ పలువురు చిత్ర ప్రముఖులలో ఉన్నారు
6/ 8
అలాగే నసీర్, శశికుమార్ సహా ప్రముఖులు వచ్చి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. రిసెప్షన్లో ఈ జంట అందరికీ చాలా అందంగా కనిపించింది.
7/ 8
లైట్ సిల్వర్ కలర్ ఫ్రాక్‌లో నిక్కీ మెరిసిపోగా.. వైట్ సూట్లో ఆది మరింత హ్యాండ్ సమ్‌గా కనిపించాడు. దీంతో ఈ జోడీని చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
8/ 8
మే 19 గల్రానీ కుటుంబానికి డబుల్ ఆఫర్ వచ్చింది. ఓ వైపు నిక్కీ పెళ్లి జరుగుతుందగా.. మరో వైపు ఆమె అక్క సంజన మగబిడ్డకు జన్మనిచ్చింది.