Myrtle Sarrosa : ఫిలిప్పీన్స్ నుంచీ దూసుకొచ్చిన మరో నటి, కోస్‌ప్లేయర్, హోస్ట్, సింగర్, సాంగ్ రైటర్... మిర్ట్లే సర్రోసా. 2012 నుంచీ ఇటు బుల్లి తెరపై, అటు సినిమాల్లో టాలెంట్ చూపిస్తూ... అంతర్జాతీయ గుర్తింపు పొందింది ఈ పాతికేళ్ల బ్యూటీ. 2016లో ఐవరీ మ్యూజిక్ అండ్ వీడియోతో డీల్ ప్రకారం పాటలు పాడిన సర్రోసా... ఆ తర్వాత స్వయంగా ఆల్బం నౌ ప్లేయింగ్ : మార్ట్లే పేరుతో రిలీజ్ చేసింది. అది బాగా సేల్ అవ్వడమే కాదు... ఫిలిప్పీన్స్ అసోసియేషన్ నుంచీ గోల్డ్ అవార్డ్ కూడా గెలుచుకుంది. ప్రస్తుతం సర్రోసా నటించిన బ్లాక్ Z సినిమా 2020లో రిలీజ్ కాబోతోంది.