అదే ఇష్టం... మనసులోని మాట బయటపెట్టిన కియారా

తెలుగు ప్రేక్షకులను మురిపించి ప్రస్తుతం బాలీవుడ్‌లో సెటిలయ్యేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న కియారా అద్వానీ... తన ఇష్టాలన్నీ బాలీవుడ్‌తోనే ముడిపడి ఉన్నాయని మరోసారి క్లారిటీ ఇచ్చింది. 2001లో విడుదలై హిట్టయిన కభీ ఖుషి కభీ ఘ‌మ్ మూవీ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ఎన్నిసార్లు చూశానో తనకే తెలియదని... అదే తన ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ అని తెలిపింది కియారా.