కియారా దాచిపెట్టిన సీక్రెట్ లీక్... ప్లాన్ అదిరిపోయిందిగా...

టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయిన కియారా అద్వానీ మళ్లీ ఎప్పుడు తెలుగు తెరపై మెరుస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఆమె మహేశ్ బాబు కొత్త సినిమాకు ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తాను టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో సరసన నటించబోతున్నానని కియారా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె ప్రభాస్ నయా మూవీలో నటించేందుకు ఓకే చెప్పిందనే గుసగుసలు జోరందుకున్నాయి. ఎక్కువగా బాలీవుడ్‌పైనే ఫోకస్ చేస్తున్న కియారా... ప్రభాస్ సినిమాలో నటిస్తే బాలీవుడ్‌లో అడ్వాంటేజ్ ఉంటుందనే భావనతో ఈ సినిమాకు ఓకే చెప్పిందనే టాక్ వినిపిస్తోంది.