Kiara Advani: వామ్మో.. కియారా అంత పెద్ద ప్లాన్‌తో ఉందా ?

Kiara Advani: టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన కియారా అద్వానీ... మళ్లీ తెలుగులో నటించేందుకు మాత్రం ముందుకురావడం లేదు. అయితే కియారా ఎందుకు ఇలా చేస్తోందనే దానిపై సరికొత్త టాక్ వినిపిస్తోంది. ఓ బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కియారాకు రానుందని... ఆ సినిమాకు డేట్స్ సమస్య రాకుండా ఉండేందుకే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.