టాలీవుడ్లో రెండు మూడు సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయిన కియారా అద్వానీ... మళ్ల తెలుగు తెరపై తళుక్కుమనేందుకు ఎందుకో తటపటాయిస్తోంది. మళ్లీ సౌత్‌లోకి వస్తే... బాలీవుడ్లో తన ఇమేజ్ పడిపోతుందేమో అనే భావనలో కియారా ఉందనే టాక్ కూడా వినిపించింది. అయితే కొద్దిరోజుల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించేందుకు కియారా ఓకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే లాక్ డౌన్ తరువాత ఈ బ్యూటీ తన నిర్ణయం మార్చుకుందని.. తెలుగు సినిమాలో నటించొద్దని డిసైడయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.