Home » photogallery » movies »

ACTRESS GENELIA GOT CHANCE IN JR NTR TRIVIKRAM NEW MOVIE AK

జెనీలియాకు తారక్ కూడా ఆఫర్ ఇచ్చాడా ?

ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించిన జెనీలియా... మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో జెనీలియా ఓ ముఖ్యపాత్ర పోషించనుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా జెనీలియాకు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ ఛాన్స్ వచ్చిందనే టాక్ జోరందుకుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలోనూ జెనీలియా నటించబోతోందని తెలుస్తోంది. మరి నిజంగానే జెనీలియాకు తెలుగులో నటించే అవకాశాలు వస్తున్నాయా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.