Faria Abdullah: టాలీవుడ్లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లాకు వచ్చింది. మాస్ మహారాజ్ రవితేజ అప్ కమింగ్ మూవీ రావాణాసురలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో ఫరియా సుడి తిరిగినట్లేనని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు
1/ 10
టాలీవుడ్లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లాకు వచ్చింది. మాస్ మహారాజ్ రవితేజ అప్ కమింగ్ మూవీ రావాణాసురలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో ఫరియా సుడి తిరిగినట్లేనని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Photo:Instagram)
2/ 10
ఫరియా అబ్దుల్లా ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టినప్పటికి వరుస అవకాశాలు రావడానికి మాత్రం చాలా టైమ్ పట్టింది. తనకు ఇష్టమైన నటుడు రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకున్న చిట్టీ ..అల్లరి నరేష్ సినిమాలో కూడా హీరోయిన్గా ఫిక్స్ అయిపోయింది.(Photo:Instagram)
3/ 10
ఉగాది పండుగ రోజున టెంకాయ కొట్టి సినిమా షూటింగ్ ప్రారంభించిన అల్లరి నరేష్ సినిమాలో ఫరియా ఏమాత్రం అందాలు చూపించనుందో అని ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. ఫరియాకు బ్రేక్ రావాలంటే మంచి హిట్ పడాల్సిందేనంటున్నారు. (Photo:Instagram)
4/ 10
సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన రావణాసుర సినిమాలో రవితేజ మాస్ స్టెప్పులకు ఫరియా అబ్దుల్లా గ్లామర్‌కి మ్యాచ్ అవుతుంది. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్గా రిలీజైేన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. (Photo:Instagram)
5/ 10
రావణాసురలో ఐదుగురు హీరోయిన్లలో ఒకరుగా నటిస్తున్న ఫరియా అబ్దుల్లా రవితేజ, తన మధ్య జరిగే సీన్స్ కేక పుట్టిస్తాయంటోంది. .మాస్ మహారాజ్ కామెడీ టైమింగ్ వేరే లెవెల్లో ఉంటుందని రీసెంట్గా ఓ ఇంటర్వూలో తెలిపింది. (Photo:Instagram)
6/ 10
ఇప్పుడు తన ఫేవరెట్ హీరోల్లో ఒకరైన రవితేజతో నటించిన తర్వాత బిజీ అవుతానేమోనని అంటోంది జాతిరత్నాలు బ్యూటీ. అంతే కాదు ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్‌బాబు, విజయ్ దేవరకొండతో యాక్ట్ చేయలన్నది తన కోరిక అంటోంది. (Photo:Instagram)
7/ 10
చిలక ప్రొడక్షన్స్‌లో అల్లరి నరేష్ నటిస్తున్న 61వ సినిమాలో కూడా ఈ చిట్టీ నటిస్తుండటంతో నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక నుంచి వరుస అవకాశాలు వస్తాయని ముందుగానే విష్ చేస్తున్నారు. (Photo:Instagram)
8/ 10
ఇక పూల పూల చీర కట్టుకొని ఇచ్చిన ఫరియా అబ్దుల్లా పోజులకు నెటిజన్ల రంభ, ఊర్వశిని మేం చూడలేదు కానీ..నువ్ వాళ్లకంటే అందంగా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. లవ్ యు ఫరియా అంటూ ప్రపోజ్ చేస్తున్నారు.(Photo:Instagram)
9/ 10
వరుస సినిమా ఛాన్సులతో బిజీగా ఉన్న హైదరాబాదీ అమ్మాయికి ఏ సినిమా బ్రేక్ ఇస్తుందో చూడాలి. ఫరియా మాత్రం అన్నీ సినిమాలు చేస్తూనే టాప్ హీరోల పక్కన నటించాలనే కోరిక తీర్చుకునేందుకు ఎదురుచూస్తోంది. (Photo:Instagram)
10/ 10
ఫరియా అబ్దుల్లా ట్రెడిషనల్ ఫోటోషూట్లు, గ్లామర్ ఫోటోషూట్లతో నెటిజన్లతో బాగా టచ్‌లో ఉంటున్న హీరోయిన్..ఛాన్సులు పెరిగితే తన అప్డేట్స్ ఆపేస్తుందేమోనని కూడా ఫాలోవర్స్ ఫీలవుతున్నారు.(Photo:Instagram)