అను ఇమ్మాన్యుయేల్‌కు టాలీవుడ్‌లో లాస్ట్ ఛాన్స్...

స్టార్ హీరోయిన రేంజ్‌కు ఎదుగుతారని అనుకునే కొందరు హీరోయిన్లు... ఒక్కసారిగా వరుస ఫ్లాపులతో పాతాళానికి పడిపోతుంటారు. అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ పరిస్థితి కూడా ఇంతే. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని వంటి స్టార్స్ సరసన నటించిన ఈ బ్యూటీ... ఇప్పుడు ఆఫర్లు పెద్దగా లేవు. ప్రస్తుతం ఆమె నిఖిల్ సరసన 18 పేజెస్ అనే మూవీలో యాక్ట్ చేయనుంది. రీసెంట్‌గా ఆమెకు ఈ సినిమాలో బెర్త్ కన్‌ఫామ్ అయ్యిందని టాక్. ఈ నయా మూవీలో ఆమె మెమొరీ లాస్ సమస్యతో బాధపడే అమ్మాయిగా కనిపిస్తుందని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్‌లో అను ఫ్యూచర్ ఏమిటో డిసైడ్ చేయబోయేది నిఖిల్ సినిమానే అని చెప్పొచ్చు.