Adah Sharma: చీర పైకి కట్టి కర్రసాము చేస్తోన్న అదా శర్మ.. ఫిదా అవుతోన్న నెటిజన్లు

Adah Sharma: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆదా శర్మ అందరికీ సుపరిచితమే. తెలుగులో హార్ట్ ఎటాక్, క్షణం వంటి హిట్ చిత్రాలలో ఆమె నటించింది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించినా ఇంకా ఈ అమ్మడికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. నటనతో పాటు పలు యుద్ధ విద్యలలో ఆరితేరని ఆదా... సోషల్ మీడియాలో తాజాగా కర్ర సాము చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. అందులో చీర ధరించి మరీ కర్ర సాము చేస్తోంది అదా. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.