గతేడాది కరోనా కారణంగా సినిమాల రిలీజ్‌ను ఆగిపోవడంతో.. అంతా ఈ ఏడాదిపై ఫోకస్ పెట్టారు. షూటింగ్ స్థాయిలో ఉన్న తమ సినిమాలను ఎఫ్పుడు రిలీజ్ చేయాలనే దానిపై దృష్టి పెట్టారు.
2/ 11
ఇందుకు సంబంధించి ఇప్పటికే కొందరు అనధికారికంగా డేట్స్ ఫిక్స్ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా అందరి దృష్టి కాసుల వర్షం కురిపించే సమ్మర్‌పైనే ఉంది. (Image: Twitter)
3/ 11
ఈ సమ్మర్లో తమ సినిమాలు విడుదల చేసేందుకు ఇప్పటికే అనేక మంది ప్లాన్ చేసుకుంటున్నారు. వీరిలో అందరికంటే ముందుగా దగ్గుబాటి హీరోలు సమ్మర్ డేట్స్ బుక్ చేసుకోవడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.(Image: Twitter)
4/ 11
ముందుగా మూడేళ్ల నుంచి ఆడియెన్స్‌ను వెయిటింగ్లో ఉంచిన రానా.. తన రెండు సినిమాల విడుదల తేదీలను అనౌన్స్ చేశారు.(Image: Twitter)
5/ 11
హాథీ మేరీ సాథీ సినిమా మార్చి 27 విడుదల అవుతుందని పేర్కొన్నాడు.
6/ 11
ఇక టాలీవుడ్లో రానా కీలక పాత్రలో నటిస్తున్న విరాటపర్వం సినిమా ఏప్రిల్ 30న విడుదల అవుతుందని ప్రకటించాడు.(Image: Twitter)
7/ 11
ఈ రెండు సినిమాలు నెల గ్యాప్‌లోనే ఆడియెన్స్ ముందుకు రానున్నాయి.(Image: Twitter)
8/ 11
ఇక వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమా ఆగస్టు 27 రిలీజ్ అవుతుందని వెంకటేశ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.(Image: Twitter)
9/ 11
ఇక ఆయన సోలో హీరోగా నటిస్తున్న నారప్ప సినిమా దీని కంటే ముందే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతందనే దానిపై మాత్రం వెంకీ క్లారిటీ ఇవ్వలేదు.(Image: Twitter)
10/ 11
అయితే ఇద్దరు దగ్గుబాటి హీరోలు ఒకే రోజు తన సినిమాల విడుదల తేదీలను ప్రకటించడంతో టాలీవుడ్లో రచ్చ మొదలయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి.(Image: Twitter)
11/ 11
కరోనా కారణంగా గతేడాది విడుదల కావాల్సిన అనేక సినిమాలు పెండింగ్‌లో ఉండటంతో.. వాళ్లు ఈ సినిమాలకు పోటీ ఇవ్వకుండా ఉంటారా అనే చర్చ మొదలైంది. అదే జరిగితే టాలీవుడ్లో సినిమాల విడుదలకు సంబంధించి వార్ జరిగే అవకాశం లేకపోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.(Image: Twitter)