నటుడు సుమన్ గురించి ప్రత్యేకం పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకప్పుడు టాలీవుడ్ యాక్షన్ సినిమాల హీరోగా సూపర్ పాపులర్. అంతేకాదు ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగాను రాణిస్తున్నారు సుమన్. అది అలా ఉంటే ఆయన తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ నాకు కమలహాసన్ గారు అంటే చాలా ఇష్టం అంటూ.. అయితే డాన్స్ పరంగా చిరంజీవిగారి డాన్స్ నాకు ఇష్టం అంటూ మాట్లాడారు. Photo : Twitter
సుమన్ చిరంజీవి డాన్స్ గురించి మాట్లాడుతూ.. చిరంజీవిగారు నేల చూడకుండా డాన్స్ చేస్తారు. ఆయన డాన్స్ చేసేటప్పుడు ఆయన బాడీలో ఒక రిథమ్, ఒక గ్రేస్ ఉంటుంది. అది అందరిని ఆకర్షిస్తుంది. అయితే ఇప్పుడు చాలా మంది కుర్రాళ్లు అంతకంటే ఫాస్టుగా చేస్తున్నారు. కానీ అది డాన్స్‌గా కాకుండా జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఉంటోందని అన్నారు. ఇక చిరంజీవి తరువాత అంత బాగా డాన్స్ చేసే హీరోగా నాకు ఎన్టీఆర్ కనిపిస్తారు అని తెలిపారు. ప్రస్తుతం సుమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్‌లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. Photo : Twitter
అందులో భాగంగా ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. చీఫ్ గెస్ట్‌గా రాజమౌళి వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఏప్రిల్ 12న ఈ సినిమాకు సంబంధించిన (Acharya Trailer) ట్రైలర్‌ను విడుదల చేసింది టీమ్. ఈట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ ఆచార్య రికార్డు క్రికెట్ చేసింది. 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇక తాజాగా ఈ ట్రైలర్ 30 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది. Photo : Twitter
దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్‌ను పూర్తిగా పవర్ ఫుల్ డైలాగ్స్ తో, యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపారు. రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి లు ఇద్దరూ కలిసి నటించిన చిత్రం కావడం, ఇద్దరినీ కూడా మాస్ అండ్ పవర్ఫుల్ గా చూపించడంతో మెగా ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. దివ్య వనం ఒకవైపు.. తీర్ధ జలం ఒకవైపు.. నడుమ పాద ఘట్టం అంటూ రామ్ చరణ్ వాయిస్‌తో ఈ సినిమా ట్రైలర్ ఓపెన్ చేసారు. ఇక్కడుండే ప్రజలు పూజలు పునస్కారాలు చేస్తూ .. కష్టాలు వచ్చినపుడు అమ్మోరు తల్లిపై భారం వేసి బిక్కు బిక్కు మంటూ ఉంటామని భ్రమ పడి ఉండవచ్చు. Photo : Twitter
ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుతుంది అంటూ బ్యాక్ గ్రౌండ్లో రామ్ చరణ్ ధర్మస్థలి ఎలా అధర్మస్థలి ఎలా అవుతుంది. ఈ ట్రైలర్లో ఫస్ట్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ పై ఉండగా.. మిగతాది చిరంజీవిపై ఉంది. ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. Photo : Twitter
ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ను (Acharya Prerelease Event) ఏప్రిల్ 23న ఆరు గంటలకు హైదరాబాద్‌లోని యూసఫ్ గూడలో నిర్వహించనుందని టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా రానున్నారట. ఇక్కడ మరో విషయం ఏమంటే.. (Acharya Prerelease Event) మొదట విజయవాడలో నిర్వహించాలనీ భావించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వస్తున్నట్లు టాక్ నడిచింది. Photo : Twitter
అయితే ఏమైందో ఏమో ప్రిరిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది టీమ్. భలే భలే బంజారా సాంగ్జను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. చిరంజీవి, రామ్ చరణ్‌లు ఇద్దరూ ఈ పాటలో కలిసి డాన్స్ ఇరగదీశారని తెలుస్తోంది. Photo : Twitter
ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటించగా.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. Photo : Twitter
ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. Photo : Twitter
ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి. Photo : Twitter