వేదికపై రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..ఈ చిత్ర ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. నేను రాసుకున్న బాహుబలి కథకు కట్టప్పగా సత్యారాజ్ నటించడంతో ఆయనకు నాకు ఎదో ఋణానుబంధం నెలకొంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కే"మయోన్" చిత్రం ద్వారా హీరోగా పరిచయ మవుతున్న సిబి చాలా చాక్కగా నటించాడు. దర్శక, నిర్మాతలు ఈ సినిమా కొరకు ఎంతో కష్టపడినా ఇష్టపడి చేశారు. అందుకే సినిమా బాగా వచ్చింది అన్నారు.
చిత్ర దర్శకుడు కిషోర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అలాగే ఈ రోజు లెజెండరీ రచయిత విజేంద్ర ప్రసాద్ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం గా ఉంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విజువల్స్ ఎక్స్ పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. ఓటిటి లో రిలీజ్ చెయ్యమని ఆఫర్ వచ్చినా కాదనకుండా ఆ విజువల్స్ ఎక్స్‌పీరియన్స్‌ను థియేటర్స్ లలో ఫుల్ స్క్రీన్‌పై చూస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నిర్మాతలు థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి మంచి కథ ఉన్న సినిమా ప్రేక్షకులకు అందరికీ రీచ్ అవ్వాలని నిర్మాతలు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు అన్నారు.
హీరో శిబి సత్యారాజ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నాకు విజేంద్ర ప్రసాద్ గారంటే ఎంతో ఇష్టం. మొదటి సారిగా తెలుగులో నేను నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ "మయోన్". ఇందులో నేను ఆర్కియాలజిస్ట్ గా నటిస్తున్నాను. ఈ నెల 7 న ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. ఈ చిత్రాన్ని నన్ను ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మయోన్ వంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు.
నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు ఇప్పటి వరకు నన్ను ఆదరించినట్లే మంచి కంటెంట్ ఉన్న "మయోన్" చిత్రం ద్వారా పరిచయమవుతున్న నా కొడుకు శిభి సత్యారాజ్ ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిర్మాతలు చాలా ఇష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ నెల 7 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.