Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్.. తెలుగు తెరకు 'జెర్సీ' సినిమా ద్వారా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో శ్రద్ధా... తన నటనతో అదరగొట్టింది. శ్రద్ధా తెలుగులోనే కాకుండా అటు కన్నడ, తమిళ సినిమాలు చేస్తోంది. అందంతో పాటు... అభినయంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ... తాజా తమిళ సినిమా 'నెర్కొండ పార్వాయి'తో తమిళనాట మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. లైంగిక వేధింపుల అంశంతో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో వచ్చిన 'పింక్' సినిమాకు రీమేక్.