Home » photogallery » movies »

ACTOR MAHESH BABU GETS EMOTIONAL ON MAHARSHI SUCCESS MEET SR

Maharshi Success Meet : కాలర్ ఎగరేసిన మహేష్ బాబు

మ‌హేశ్ బాబు సాధార‌ణంగా ఇలాంటి ప‌నులు అస్స‌లు చేయ‌డు. చాలా సైలెంట్‌గా స్టేజ్ ఎక్కుతుంటాడు.. మాట్లాడ‌తాడు.. దిగిపోతాడు. అంతేకానీ ఫ్యాన్స్ కోసం విజిల్స్ వేయ‌డాలు.. తొడ గొట్ట‌డాలు.. కాల‌ర్ ఎగ‌రేయ‌డాలు లాంటి ప‌నులు అస్స‌లు చేయ‌డు. కానీ 'మ‌హ‌ర్షి' సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో ఈ చిత్రం చూసిన త‌ర్వాత నాన్న‌గారి అభిమానుల‌తో పాటు నా అభిమానులు కూడా కాల‌ర్ ఎగ‌రేసుకునే సినిమా ఇది అవుతుంద‌ని చెప్పాను.. ఇప్పుడు నిజంగానే అది నిజం చేసి చూపించారు.. థ్యాంక్స్ అని చెప్పాడు.. మ‌హేశ్. అలా మాట్లాడుతూ.. స‌క్సెస్ మీట్‌లో కాస్త ఎమోష‌న‌ల్ అయ్యాడు మ‌హేశ్ బాబు. అది చూసిన త‌ర్వాత అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. మ‌హ‌ర్షి సినిమా మూడు రోజుల్లోనే 50 కోట్ల‌కు పైగా షేర్.. 80 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది.