దీంతో ఫ్యామిలీ మెంబర్స్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్ బాబు మృతి (Ramesh Babu Passed Away) చెందినట్టు తెలుస్తోంది. రమేష్ బాబు 1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరాలకు మొదటి సంతానంగా జన్మించారు. రమేష్ బాబు బాల నటుడిగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో పరిచయం అయ్యారు. (Twitter/Photo)
రమేష్ బాబు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’, ‘పాలు నీళ్లు’ చిత్రాల్లో నటించారు. రమేష్ బాబు.. వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’తో హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రం ‘సామ్రాట్’తో మంచి విజయాన్ని అందుకున్నారు రమేష్ బాబు. ఆ తర్వాత ఈయన ‘చిన్ని కృష్ణుడు’, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్’ ‘ముగ్గురు కొడుకులు’, కృష్ణ గారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, ఆయుధం వంటి పలు చిత్రాల్లో నటించారు. (Twitter/Photo)
ఇక హీరోగా ముగిసాక.. మహేష్ బాబు హీరోగా కృష్ణ ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించి.. ‘అర్జున్’ ‘అతిథి’ చిత్రాలను తెరకెక్కించాడు. అంతేకాదు ‘దూకుడు’ ‘ఆగడు’వంటి చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలియుగ కర్ణుడు’ ముగ్గురు కొడుకులు, ఆయుధం, చిరవగా ‘ఎన్కౌంటర్’ చిత్రాల్లో తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రమేష్ బాబు. (Twitter/Photo)
తమ్ముడు మహేష్ బాబుతో నిర్మాతగా సినిమాలు నిర్మించడమే కాకుండా.. తమ్ముడుతో కలిసి ‘‘బజారు రౌడీ’, ‘ముగ్గురు కొడుకులు’ చిత్రాల్లో కలిసి నటించారు రమేష్ బాబు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తమ్ముడు మహేష్ బాబుతో కలిసి ‘ముగ్గురు కొడుకులు’ చిత్రంలో కలిసి నటించిన రమేష్ బాబు. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది.. (Twitter/Photo)