‘నా జీవితంలో చెప్పుకోదగ్గ మంచి విషయం ఏంటంటే.. కొన్నేళ్ల క్రితం మేం ఒకరికీ, మరొకరం పరిచయం అయ్యాం. ఇరు కుటుంబాల సమక్షంలో మా నిశ్చితార్థం మార్చి 24న ఘనంగా జరిగింది. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం. అందుకు మీరందరూ ఆశీస్సులు, దీవెనలు అందించాలి’అని ఆది సోషల్ మీడియా ద్వారా కోరాడు.(Photo: AadhiPinisetty twitter)
తెలుగు చిత్రసీమలో దర్శకుడు-నటుడు మధ్య గాఢానుబంధాల జాబితా రూపొందిస్తే అందులో ‘రవిరాజా పినిశెట్టి-మంచు మోహన్ బాబు’ ద్వయం అగ్రభాగాన నిలుస్తుంది. ఇండస్ట్రీ రికార్డులు చెరిపేసిన సినిమాలెన్నో అందించిన ఈ ద్వయం.. వ్యక్తిగతంగానూ దగ్గరగా ఉంటానమని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మెగాస్టార్ చిరంజీవితోనూ పినిశెట్టికి చాలా అనుంబంధం ఉంది. కానీ టాలీవుడ్ పెద్దలు ఈ వేడుకలో కనిపించలేదు.
నిశ్చితార్థానికి కొద్ది మందినే పిలవడం వల్ల మంచు ఫ్యామిలీ మిస్ అయిందా, లేక పనుల బిజీ వల్ల రాలేకపోయారా? అనేది వెల్లడికాలేదు. అయితే, ఆది-నిక్కీల పెళ్లి వేడుకను గ్రాండ్ జరపాలని, అప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరినీ పిలవాలని పినిశెట్టి కుటుంబం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.(Photo: AadhiPinisetty twitter)