Acharya - RRR : ఆచార్య, ఆర్ఆర్ఆర్ సహా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు.. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ తెలంగాణ,ఏపీ సహా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించి సినిమాగా టాప్ ప్లేస్‌లో ఉంది. తాజాగా విడుదలైన ఆచార్య సినిమా కూడా ఏపీ, తెలంగాణ సహా ప్రపంచ వ్యాప్తంగా ఓ మోస్తరు కలెక్షన్స్‌ను రాబట్టింది. మొత్తంగా ఆచార్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాల్లో ఎన్నో స్థానంలో ఉందంటే.. (Twitter/Photo)
1.ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం సాధించింది. మొదటి రోజు ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా తన పేరిట రికార్డులను నెలకొల్పింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు.. రూ. 135 కోట్ల షేర్ రాబట్టి అన్ని రికార్డులను వెనక్కి నెట్టి మొదటి ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)
7. ప్రభాస్ ’రాధే శ్యామ్ భారీ అంచనాలతో విడుదలైనా కూడా ఒక్క రికార్డు కూడా చెరిపేయలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాహో కంటే చాలా తక్కువ వసూలు చేసింది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 25.50 కోట్ల షేర్ వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే ఇవి తక్కువే అని చెప్పాలి. పైగా ఏపీలో టికెట్ రేట్లు పెరిగిన తర్వాత కూడా తక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ చిత్రం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 40 కోట్ల షేర్ వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. (Twitter/Photo)
13. భీమ్లా నాయక్: కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు.. ఇప్పుడు పవన్ సినిమాకు మొదటి రోజు తక్కువ వసూళ్లు రావడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైంది ఏపీలో టికెట్ రేట్స్. ఈ కారణంగానే భీమ్లా నాయక్ మొదటి రోజు 26.42 కోట్ల దగ్గరే ఆగిపోయింది. వాల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే ఈ సినిమా 36.37 కోట్లను కొల్లగొట్టింది.
16. చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా తెలంగాణ (నైజాం)లో మొదటి రోజు రూ. 7.90 కోట్లతో టాప్ 10లో ఉంది. ఇద్దరు మెగాహీరోలున్న ఈ సినిమాకు ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడంపై చర్చ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 35.05 కోట్ల షేర్‌తో టాప్ 16లో ఉంది. (Twitter/Photo)
18. వినయ విధేయ రామ: రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా.. పైగా బోయపాటి శ్రీను దర్శకుడు కావడంతో వినయ విధేయ రామపై అంచనాలు చాలానే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే తొలిరోజు 25.99 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఫస్ట్ డే వాల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 31.31 కోట్లను కొల్లగొట్టింది.