‘ఆచార్య’ మూవీ విడుదల తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా స్టోరీని బాలకృష్ణ నటించిన ‘అఖండ’తో పోల్చి చూస్తున్నారు. ఈ రెండు సినిమాల స్టోరీ లైన్ ఒకటే అంటున్నారు.ఈ రెండు సినిమాలు హిందూ ధర్మం ఆధారంగా తెరకెక్కించారని చెబుతున్నారు. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా మైనింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించారు. (Twitter/Photo)
‘అఖండ’ సినిమాను ముఖ్యంగా మైనింగ్ మాఫియాను ఓ అఘోరా ఎలా ఎదురించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మంలో ధర్మో రక్షితి రక్షిత: నేపథ్యంలో తెరకెక్కించారు. అధర్మం పెచ్చరిల్లునపుడు దేవుడు ఆదేశంతో దాన్ని చక్కదిద్దడానికి దిగివస్తాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అటు ఆచార్య సినిమా కూడా మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. (Twitter/Photo)
అఖండ, ఆచార్య రెండు సినిమాల్లో మెయిన్ స్టోరీ మైనింగ్ మాఫియాతో పాటు హిందూ ధర్మానికి న్యాయం చేయడమే కాన్సెప్ట్. ఈ రెండు సినిమాల్లో పెద్దగా కథ లేదు. కానీ బోయపాటి శ్రీను, బాలయ్యతో తెరకెక్కించిన ‘అఖండ’లో హీరో ఎలివేషన్ సీన్స్ బాగా పండాయి. అదే కొరటాల శివ.. చిరంజీవితో ఎలివేషన్స్ సీన్స్ తెరకెక్కించడంలో వెనకబడ్డాడనే చెప్పాలి. ఇదే విషయాన్ని అభిమానులు ప్రస్తావిస్తున్నారు. (Twitter/Photo)
ఆచార్య, అఖండ సినిమాలు ఒకేసారి షూటింగ్ మొదలు పెట్టారు. ఈ రెండు సినిమాలను కోవిడ్ ఇబ్బంది పెట్టాయి. ఈ రెండు సినిమాలు గతేడాది మే నెలలో విడుదల కావాల్సింది. ముందుగా ఆచార్య మే 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక అఖండ సినిమాను మే 28న విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌తో ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. (Twitter/Photo)
ఆ తర్వాత చిరంజీవి ఆచార్య సినిమాను విడుదల చేస్తే ఆడియన్స్ వస్తారా రారా అనే శంకతో ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేశారు. అదే బాలయ్య విషయానికొస్తే.. ‘అఖండ’ సినిమాను సెకండ్ వేవ్ తర్వాత ధైర్యంగా థియేటర్స్‌లో అది కూడా అన్‌సీజన్‌లో విడుదల చేసి మంచి విజయం సాధించారు. దీంతో మిగిలిన సినిమాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత థర్డ్ వేవ్ దేశాన్ని ఇబ్బంది పెట్టడంతో ఫిబ్రవరి నుంచి వరుసగా పెద్ద సినిమాలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో ఆచార్య ఎన్నో వాయిదాల తర్వాత ఈ రోజు విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. (Twitter/Photo)