Chiranjeevi - Ram Charan - Acharya Trailer Talk : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేయనుంది. ఈ కోవలో ఆచార్య మూవీ ట్రైలర్ విడుదల చేశారు. (Twitter/Photo)
తాజాగా విడుదలైన ‘ఆచార్య’ మూవీ ట్రైలర్ చూస్తుంటే.. రామ్ చరణ్ సిద్ధ పాత్ర మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ పాత్రను డామినేట్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్గా రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ పాత్ర ఎన్టీఆర్ క్యారెక్టర్ డామినేట్ చేసే విధంగా ఉందనే కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. రాజమౌళిని నమ్మి ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తే.. జక్కన్న తారక్ పాత్రకు అన్యాయం చేసారని రాజమౌళిని దుమ్మెత్తి పోస్తున్నారు. (Twitter/Photo)
ఇపుడు అదే తరహాలో ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్ర చిరంజీవి పాత్రను డామినేట్ చేసే విధంగా ఉన్నా.. స్వతహాగా తండ్రీ కొడుకులైన వీళ్లిద్దరి మధ్య అభిమానులు ఆ పోలికను అంతగా పట్టించుకోరు. ఇక చిరు కూడా తన తనయుడు పాత్ర తన పాత్రను డామినేట్ చేసినా అభిమానులు కూడా అంతగా పట్టించుకోరు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్‌కు వచ్చిన ఇమేజ్ను హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం వాడుకోవాలనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ పాత్రను పెంచినట్టు ఉన్నారనే కామెంట్స్ వినబడుతున్నాయి. (Twitter/Photo)
చిరంజీవి, రామ్ చరణ్ మొదటి సారి.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో ఓ పాటలో చిరు కాసేపు కనిపించి అలరించారు. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీలో చిరు గెస్ట్ పాత్రలో అలరించారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’లో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటలో రామ్ చరణ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఈ రకంగా తండ్రి తనయులు ఇప్పటికే మూడు సార్లు అభిమానులు కనువిందు చేశారు. తాజాగా ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో నటించారు. ఈ సినిమ మెగాభిమానులకు తీపి కానుక అని చెప్పాలి. (Twitter/Photo)
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. (Twitter/Photo)
కొరటాల శివ ఆచార్య సినిమాను తనదైన సోషల్ మెసెజ్‌తో తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. (Twitter/Photo)