Acharya OTT Streaming : అనుకున్న సమయం కంటే ముందే ‘ఆచార్య’ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవును ఆచార్య సినిమాకు మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దాంతో ఈ సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. (Twitter/Photo)
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. ఆచార్య డివైడ్ టాక్‌కు కూడా అన్నే కారణాలున్నాయంటున్నారు ప్రేక్షకులు. తెలంగాణలో ఇప్పటికే టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా అదనంగా మరో రూ. 50 రూపాయలు పెంచడం.. మరోవైపు 10Th Class ఎగ్జామ్స్ కూడా ఉండటంతో కొన్ని ఫ్యామిలీలు థియేటర్స్ వైపు అసలు చూడటం లేదు. పైగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు చూడటంతో ఈ సినిమా చూడటానికి మొగ్గు చూపలేదు. ఇవన్ని కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై తీత్ర ప్రభావం చూపించాయి.
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర సినిమాలో సగం ఉంటోంది. ఇద్దరు నటన పరంగా బాగానే ఉన్న.. కథ, కథనం సరిగా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది.
కథ లేకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్ స్టార్స్ ఉన్న సినిమాను కాపాడలేదనే విషయం మరోసారి ఆచార్య రిజల్డ్తో స్పష్టమైంది. ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమా ఈ సినిమా రూ. 80 నుంచి రూ. 85 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశాలున్నాయి.
ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా సోనూ సూద్ నటించారు. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. (Twitter/Photo)
ఇక ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను రెండు వారాల వ్యవధిలో ఈ సినిమాను అమెజాన్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. దీంతో అమెజాన్ వాళ్లు ఆచార్య మేకర్స్‌కు మరో రూ. 10 కోట్లు అదనంగా చెల్లించినట్టు సమాచారం. ఈ సినిమాను మే 13 లేదా 15న స్ట్రీమింగ్ చేయడం పక్కా అని చెబుతున్నారు. మొత్తంగా నెగిటివ్ టాక్‌తో ఈ సినిమా అనుకున్న సమయం కంటే ముందే స్ట్రీమింగ్కు వస్తోంది. (Twitter/Photo)