Acharya OTT Responce | కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన రీతిలో పర్ఫామ్ చేయకపోయినా.. ఓటీటీ వేదికగా లేదా శాటిలైట్స్ ఛానెల్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటూ ఉంటాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది అతడు, ఖలేజా సినిమాలు. అందులో ఖలేజా సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచినా.. టీవీల్లో మాత్రం సూపర్ సక్సెస్ అయింది. తాజాగా ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాను విడుదలైన మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదల చేసారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందంటే..
చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోని ఈ సినిమాను మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ అదే రోజు ‘ఆర్ఆర్ఆర్’ తో పాటు కేజీఎఫ్ 2 సినిమాలు కూడా వేరే వేరే ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు ఎక్కువగా ఆ సినిమాలకు కనెక్ట్ అయ్యారు. (Twitter/Photo)
మరోవైపు ఆచార్య సినిమాను చూడాలనుకున్న ప్రేక్షకులు ఈ సినిమా అంతగా క్లిక్ చేయలేదనే టాక్ అమెజాన్ ప్రైమ్ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఈ సినిమాను ఓటీటీలో చూసిన ఎక్కువ ప్రేక్షకులు .. ఎక్కువ సేపు ఆ సినిమాను చూడలేకపోయినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఆదరన పొందని ఆచార్య సినిమాకు.. ఓటీటీలో కూడా ప్రేక్షకులు భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏమైనా ప్రేక్షకులు ఓటీటీలో కూడా పెద్ద స్టార్స్ కంటే.. కంటెంట్ ఉన్న కథల వైపే మొగ్గు చూపుతున్నట్టు ఆచార్య సినిమాతో మరోసారి స్పష్టమైంది. (Twitter/Photo)
ఇక మరోవైపు కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. ఆచార్య డివైడ్ టాక్‌కు కూడా అన్నే కారణాలున్నాయంటున్నారు ప్రేక్షకులు. తెలంగాణలో ఆచార్య విడుదల సమయానికీ టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా అదనంగా మరో రూ. 50 రూపాయలు పెంచడం.. మరోవైపు CBSC కు సంబంధించిన 10Th Class ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. దాంతో ఈ సినిమా చూద్దామనుకున్న కొన్ని ఫ్యామిలీలు థియేటర్స్ వైపు అడుగులు వేయలేకపోయాయి. పైగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు చూడటంతో పాటు రెండు వారాల గ్యాప్‌లో నెలాఖరులో విడుదలైన ఈ సినిమా చూడటానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్టలేదు. ఇద్దరు బడా స్టార్ హీరోలున్నా.. కథ లేకపోత చూసేది లేదనే విషయం ఆచార్య సినిమాతో ప్రూవ్ అయింది. దీంతో మేకర్స్ కథపై దృష్టి పెడితే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇవన్ని కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించాయి.
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు నక్సల్స్ పాత్రల్లో కనిపించారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర సినిమాలో సగం ఉంటోంది. ఇద్దరు నటన పరంగా బాగానే ఉన్న.. కథ, కథనం సరిగా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది.
కథ లేకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్ స్టార్స్ ఉన్న సినిమాను కాపాడలేదనే విషయం మరోసారి ఆచార్య రిజల్డ్తో స్పష్టమైంది. ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమా ఈ సినిమా రూ. 84 కోట్ల వరకు బయ్యర్స్‌కు నష్టాలను మిగిల్చింది. దీంతో తమ నెక్ట్స్ మూవీలతో వారిని ఆదుకుంటామని ఈ చిత్ర నిర్మాత కమ్ హీరో రామ్ చరణ్ బయ్యర్స్‌కు హామి ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ఓ మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. కాగా ఆయన మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి, ఒకప్పటి హీరోయిన్.. ఇప్పడు నిర్మాతగా రాణిస్తోన్న రాధిక (Radhika Sarath Kumar) నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ప్రాజెక్ట్‌లో రాధిక, చిరంజీవితో నటించనున్నారట. గతంలో చిరంజీవి, రాధిక కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ తాజా ప్రాజెక్ట్ సినిమానా లేక ఏదైనా వెబ్ సిరీస్ కోసమా అనేది తెలియాల్సి ఉంది.
సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుంది.
ఈ రెండు సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్.
మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.