Chiranjeevi : చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏజ్ 60 దాటినా.. యంగ్ హీరోలను మించిన దూకుడుతో వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఇరగదీస్తోన్న చిరంజీవి కెరీర్లో ఓ సీనియర్ హీరోయిన్ చేయి చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Megastar Chiranjeevi Photo : Twitter)
చిరంజీవి ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు చాలా యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ కమర్షియల్ యాడ్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ కోవలో శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ యాడ్ చేసారు. తెలుగు కొత్త సంవత్సరాది రోజున ఈ యాడ్‌ను విడుదల చేశారు. ఈ యాడ్‌లో చిరంజీవి సీనియర్ హీరోయిన్ కుష్బూతో పాటు అనసూయతో నటించడం విశేషం. ఈ యాడ్‌కు విశేష స్పందన లభిస్తోంది. (bhola shankar)
ఈ యాడ్ కోసం చిరంజీవి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ యాడ్ కోసం చిరంజీవి దాదాపు రూ. 7 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి తన ఓన్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. ఈ కోవలో ఒక్కో సినిమా కోసం రూ. 20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. ఈ కోవలో ఈ యాడ్ కోసం రూ. 7 కోట్ల వరకు చార్జ్ చేసినట్టు సమాచారం. (Twitter/Photo)
ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కంప్లీటైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తొలిసారి పూర్తి స్థాయిలో తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల కానుంది. (Acharya Photo : Twitter)
దాంతో పాటు దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God Father) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. (Twitter/Photo)
ఆ సంగతి పక్కన పెడితే.. ఒకప్పటి చిరంజీవితో హిట్ పెయిర్ పేరు తెచ్చుకున్న రాధిక .. న్యాయం కావాలి సినిమా షూటింగ్లో చిరంజీవితో ఓ సన్నివేశంలో చెంప చెళ్లుమనిపించే సీన్ చేయాల్సి వచ్చింది. ఈ కోవలో చిరంజీవి చెంపను చెళ్లు మనిపించే సీన్ సరిగా రాలేదు. దాదాపు 20 పైగా టేకుల తర్వాత ఆ సీన్ ఓకే అయిందట. అప్పటికే చిరంజీవి చెంప ఎర్రగా మారిపోయింది. ఆ సీన్ తర్వాత రాధిక.. చిరంజీవికి సారీ చెప్పిందట. (Twitter/Photo)
ఈ సంఘటనను తాజాగా రాధిక.. ఆలీతో సరదగా కార్యక్రమంలో ప్రస్తావించారు. ఇక చిరంజీవి, రాధిక టాలీవుడ్లో ఎక్కువ చిత్రాల్లో జోడిగా నటించారు. వీళ్లిద్దరు కలిసి ‘న్యాయం కావాలి’ నుంచి ‘రాజా విక్రమార్క’ వరకు దాదాపు 20కి పైగా చిత్రాల్లో జోడిగా కనువిందు చేశారు. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు వీళ్లిద్దరి కెరీర్‌కు హెల్ప్ అయ్యాయి. (Twitter/Photo)
చిరు సినిమాల్లో ఏదైనా రోల్ వస్తే నటించేందుకు మీరు సిద్ధమా? అని ప్రశ్నగా... ఎలాంటి పాత్ర అయినా చేస్తా కానీ... చిరంజీవి తల్లిగా అయితే అస్సలు చేయనని తెగేసి చెప్పింది. రాధిక. ఇక మెగాస్టార్ సినిమాలో కావాలంటే విలన్‌గా అయినా చేస్తాను, ఎలాంటి పాత్రలు అయినా చేస్తాను కాని.. తల్లి పాత్ర మాత్రం చేయనంది. ఇయ టాలీవుడ్ యంగ్ హీరోలపై కూడా రాధిక మాట్లాడింది.తనకు తెలుగు హీరోలందరూ చాలా ఇష్టమని తెలిపింది. (Twitter/Photo)
ముఖ్యంగా జూ. ఎన్టీఆర్‌తో నటించడం తన డ్రీమ్ అని చెప్పింది. ఆయన సినిమాలో ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం అంటూ కామెంట్స్ చేసారు. ఇక మహేష్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్ చిన్నతనం నుంచి తనకు తెలుసు. ఇప్పుడు వాళ్లని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది రాధిక. రీసెంట్గా రాధిక ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో తెలుగులో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోకపోయినా.. మంచి చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. (Twitter/Photo)