సినీ ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్‌కు నిలయం. ఇక్కడ తుమ్మినా.. దగ్గినా.. నిలుచున్న అన్నింటికీ సెంటిమెంట్‌తో ముడిపెడుతూ ఉంటారు. అది మంచి జరిగినా.. చెడు జరిగినా గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ సెంటిమెంట్‌ను రగిలిస్తూ ఉంటారు. అందులో కొన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ ఉంటే.. ఇంకొన్ని గుడ్ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. అలానే చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీని కొన్ని గుడ్ మరియు బ్యాడ్ సెంటిమెంట్స్ వెంటాడుతున్నాయి. అవేంటే చూద్దాం.. (Twitter/Photo)
‘ఆచార్య’ మూవీలో గుడ్ సెంటిమెంట్స్ విషయానికొస్తే.. ఈ సినిమాలో తొలిసారి తండ్రీ తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ ఈ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చనిపోతుందనే టాక్ నడుస్తోంది. గతంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’, ‘ఎవడు’ చిత్రాల్లో చనిపోయే పాత్రల్లో నటించారు. ఆయా సినిమాలు సూపర్ హిట్టైయ్యాయి. అదే కోవలో ‘ఆచార్య’కు రామ్ చరణ్ పాత్ర సిద్ధ చనిపోవడం కలిసి వస్తోందని అభిమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. (Twitter/Photo)
మరోవైపు ఆచార్య సినిమాను డైరెక్ట్ చేసిన కొరటాల శివ విషయానికొస్తే.. ఈయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’ భరత్ అను నేను’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. రాజమౌళి తర్వాత అపజయం ఎరగని దర్శకుడి పేరు గాంచాడు. మరి ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు కలిసొస్తుందా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)
ఆచార్య సినిమాకు ఇంకో గుడ్ సెంటిమెంట్ ఏమిటంటే.. చిరంజీవితో కాజల్ అగర్వాల్ నటించిన ‘ఖైదీ నంబర్ 150’ మూవీ సూపర్ హిట్ అయింది. మరోవైపు కాజల్ రామ్ చరణ్‌తో చేసిన ‘మగధీర’, నాయక్’, గోవిందుడు అందరివాడేలే’ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచాయి. మరోవైపు రామ్ చరణ్, పూజా హెగ్డే తొలిసారి ‘రంగస్థలం’లో ఓ ఐటెం సాంగ్ చేసారు. ఆయా సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో ఈ సినిమాకు ఆ గుడ్ సెంటిమెంట్ కూడా కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. (Twitter/Photo)
ఆచార్యను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ విషయానికొస్తే.. ఏ హీరో అయినా.. రాజమౌళి దర్శకత్వంలో నటించిన తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతూ ఉంటాయి. తాజాగా రామ్ చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. మరి ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘ఆచార్య’ సినిమాతో ఆ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి హిట్ అందుకుంటారా లేదా అనేది చూడాలి. Acharya Photo : Twitter
చిరంజీవి, రామ్ చరణ్ మొదటి సారి.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో ఓ పాటలో చిరు కాసేపు కనిపించి అలరించారు. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీలో చిరు గెస్ట్ పాత్రలో అలరించారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’లో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటలో రామ్ చరణ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఈ రకంగా తండ్రి తనయులు ఇప్పటికే మూడు సార్లు అభిమానులు కనువిందు చేశారు. తాజాగా ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో నటించారు. ఈ సినిమ మెగాభిమానులకు తీపి కానుక అని చెప్పాలి. (Twitter/Photo)
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. (Twitter/Photo)
కొరటాల శివ ఆచార్య సినిమాను తనదైన సోషల్ మెసెజ్‌తో తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. (Twitter/Photo)