కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. ఆచార్య డివైడ్ టాక్‌కు కూడా అన్నే కారణాలున్నాయంటున్నారు ప్రేక్షకులు. తెలంగాణలో ఇప్పటికే టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా అదనంగా మరో రూ. 50 రూపాయలు పెంచడం.. మరోవైపు 10Th Class ఎగ్జామ్స్ కూడా ఉండటంతో కొన్ని ఫ్యామిలీలు థియేటర్స్ వైపు అసలు చూడటం లేదు. ఇవన్ని కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై తీత్ర ప్రభావం చూపించాయనే టాక్ వినిపిస్తోంది.
కథ లేకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్ స్టార్స్ ఉన్న సినిమాను కాపాడలేదనే విషయం మరోసారి ఆచార్య రిజల్డ్తో స్పష్టమైంది. ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.50 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ. 5.15 కోట్లు రాబడితే.. మూడో రోజు ఆది వారం.. రూ. 4.07 కోట్లు మాత్రమే వస్తే.. నాల్గో రోజు.. ఈ సినిమాకు రూ. 53 లక్షలు మాత్రమే రాబట్టి బాక్సాఫీస్‌ను నిరాశ పరిచింది. ఐదో రోజు .. ఈ సినిమా 82 లక్షలు మాత్రమే వసూళు చేస్తే... ఆరో రోజు ఈ సినిమా కేవలం .. రూ. 26 లక్షల షేర్ మాత్రమే వసూళు చేసింది. ఏడో రోజు ఈ సినిమా కేవలం రూ. 12 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇక రాను రాను ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. నిన్న ఈ సినిమా కేవలం రూ. 1 లక్ష షేర్ మాత్రమే రావడం ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ): రూ. 12.43 కోట్లు / రూ. 38కోట్లు సీడెడ్ (రాయలసీమ): రూ. 6.20కోట్లు / రూ. 18.50 కోట్లు ఉత్తరాంధ్ర: రూ. 4.85కోట్లు / రూ. 13 కోట్లు ఈస్ట్: రూ. 3.24 కోట్లు / రూ. 9.50 కోట్లు వెస్ట్: రూ. 3.40 కోట్లు / రూ. 7.02 కోట్లు గుంటూరు: రూ. 4.59 కోట్లు / రూ. 9 కోట్లు కృష్ణా: రూ. 3.08కోట్లు / రూ. 8 కోట్లు నెల్లూరు : రూ. 2.94 కోట్లు / రూ. 4.30 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 40.73 కోట్లు / రూ. 107.50 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ : రూ. 2.79 కోట్లు / రూ. 9 కోట్లు ఓవర్సీస్ : రూ. 4.77 కోట్లు / రూ. 12 కోట్లు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.29 కోట్లు (రూ. 75.90 కోట్ల గ్రాస్) / రూ. 131.20 కోట్లు షేర్ రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 132.50 కోట్ల షేర్ రాబట్టాలి. (Twitter/Photo)
మొత్తంగా ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా రూ. 48.29 కోట్ల షేర్ (రూ. 75.90కోట్ల గ్రాస్) రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 84.21 కోట్లను రాబడితే కానీ బ్రేక్ ఈవెన్ పూర్తి కాదు. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 84 కోట్లకు పైగా బయ్యర్స్‌కు నష్టాలు తీసుకొచ్చిందనే చెప్పాలి. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఆచార్య ఆల్ టైమ్ డిజాస్టర్‌గా నిలిచింది.