కరీనా, అమీర్ ఖాన్ కలిసి లాల్ సింగ్ చడ్డా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరు కలిసి కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లారు. అక్కడ అమీర్ ఖాన్... కరీనా కపూర్ మధ్య జరిగిన అనేక రకాల సంభాషణలు ఈ వారం షో అదిరిపోతుందనే హింట్ ఇస్తున్నాయి. ఇక కరణ్ ’ను కూడా అమీర్ గట్టిగానే టార్గెట్ చేశారు.
కాఫీ విత్ కరణ్ షోకు సంబంధించి తాజాగా విడుదలైన ప్రొమోలు... కరణ్ కరీనాకు సెక్స్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలు వేశాడు. దీంతో ఆమె నీకు తెలియదా.. అంటూ చెబుతంది. దీంతో కరణ్ మా అమ్మ కూడా టాక్ షో చూస్తుంటుంది... నువ్వు నా సెక్స్ లైఫ్ గురించి చెడుగా మాట్లాడితే.. తాను ఏం అనుకుంటుంది అంటూ కరణ్ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే కరణ్ మాటను అదుకున్న అమీర్ ఖాన్... దిమ్మతిరిగే డైలాగ్ వేసి కరణ్ మైండ్ బ్లాంక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చాడు.
[caption id="attachment_1392944" align="alignnone" width="515"] ఆ తర్వత అమీర్ ఖాన్ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటానంటాడు. దీనికి కరీనా బదులిస్తూ ఫ్రెండ్లీ అంటే నీలా కాదు నాలా ఉండాలి. అంటోంది. అందుకే నన్ను అంతా లవ్ చేస్తారంటుంది కరీనా, దానికి అమీర్ ఖాన్ అవును అందరూ నిన్నే లవ్ చేస్తారు. కానీ ఇంతలా ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు. ఒక్కసారి కాదు రెండు రెండు సార్లు ఇన్ సల్ట్ చేస్తున్నావంటూ నవ్వుతూ అంటాడు.