Home » photogallery » movies »

AADI SAI KUMAR NEW MOVIE STARTS TODAY WITH POOJA CEREMONY COCONUT BROKEN EVENT HERE ARE THE DETAILS TA

Aadi Sai kumar : పూజా కార్యక్రమాలతో ఆది సాయి కుమార్ కొత్త సినిమా షురూ..

Aadi Sai Kumar | ప్రముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ యువ హీరో.. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిన ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.