Aadhi Pinisetty - Nikki Garlani | రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ఈ రోజు పెళ్లి పీటలెక్కుతున్నారు. కొన్ని రోజులుగా ఈయన హీరోయిన్ నిక్కీ గల్రాని (Nikki Galrani) తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ కలిసి అప్పట్లో మరకతమణి సినిమాలో కలిసి నటించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. (Twitter/Photo)
స్నేహం నుంచి మొదలైన ఈ జోడీ.. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చారు. కొన్ని రోజులుగా ఈ ఇద్దరి ప్రేమ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ ఒక్కటి కాబోతున్నారు. 39 ఏళ్ల ఆది.. 30 ఏళ్ళ నిక్కీ గల్రానితో త్వరలోనే ఏడడుగులు నడవబోతున్నాడు. మార్చ్ 24న ఈ ఇద్దరి నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. ఇండస్ట్రీలో నాని ఒక్కరే హాజరయ్యారు. (Twitter/Photo)
నిక్కీ గర్లానీ 2014 లో విడుదలైన "1983" అనే మళయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు.తరువాత ఒం శాంతి ఒశానా అనే మలయాళ చిత్రంలో నటించారు. "అజిత్","జంబొ సవారి" అనే కన్నడ చిత్రాలలో నటించారు. ప్రేమకథా చిత్రమ్ కి తమిళ పునఃనిర్మాణమైన "డార్లింగ్" అనే చిత్రంతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టారు. సునీల్ సరసన కృష్ణాష్టమి ద్వారా తెలుగు ఇండస్ట్రీకి నిక్కీ పరిచయం అయ్యారు.