Nani : నాచురల్ స్టార్ నాని గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy) మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఓకే అనిపించుకున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే నాని (Nani) నటించిన మరో లేటెస్ట్ సినిమా అంటే సుందరానికి.. (Ante Sundaraniki). ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా నిర్మాతలపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఈ నెల 9న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే . ఈ ప్రిరిలీజ్ వేడుకకు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవ్వడంతో భారీగా అభిమానులు వచ్చారు. కాగా.. ఈ వేడుకలో ఎక్కడా కరోనా నియమాలను పాటించలేదని మైత్రీ మూవీ మేకర్స్, కార్యక్రమ నిర్వహణ సంస్థ శ్రేయస్ మీడియాపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Photo : Twitter
ఇక అంటే సుందరానికీ సినిమా విషయానికి వస్తే.. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ. సుందర్, లీలా థామస్ పాత్రల్లో నాని, నజ్రియా నజీమ్‌లు అదరగొట్టారు. సుందర్, లీలా థామస్‌ను ఎలా కలిసారు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరి వల్ల రెండు ఫ్యామిలీల్లో ఎలాంటీ పరిణామాలు జరిగాయి, సుందర్, లీలాలు ఎలా తమ లవ్‌ను విజయవంతంగా పెళ్లి వరకు తీసుకెళ్లారు.. అనేది కథ. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళీ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్గా చేశారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. Photo : Twitter
ఇక నాని నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. Photo : Twitter
దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో దసరా విడుదల కానుంది. దసరా (Dasara) సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంత (Samantha Ruth Prabhu)ను తీసుకుంటున్నారట. Photo : Twitter
ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో పాటు ఈ సినిమా నుంచి స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది. Photo : Twitter